Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ ద్రావిడ్‌ను కాపీకొడుతున్న పాకిస్థాన్ (video)

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (16:10 IST)
భారత క్రికెట్ జట్టులో 'ది వాల్‌'గా పేరొందిన క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత భారత క్రికెట్‌కు తనవంతు సేవలు అందిస్తున్నాడు. ఫలితంగా మెరికల్లాంటి యువ క్రికెటర్లు తయారవుతున్నారు. భారత జూనియర్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉంటున్న రాహుల్ ద్రావిడ్.. అనేక మంది యువ క్రికెటర్లను సానబట్టి అత్యుత్తమ క్రికెటర్లుగా తీర్చిదిద్దుతున్నారు. దీంతో సీనియర్ జట్టులో సీనియర్ లేరు అనే లోటు ఎక్కడా కనిపించడం లేదు. 
 
రాహుల్ ద్రావిడ్‌ను స్ఫూర్తిగా తీసుకున్న పాకిస్థాన్ కూడా ఇదే మార్గాన్ని అనుసరించనుంది. మాజీ క్రికెటర్లను రంగంలోకి దించి యువ క్రికెటర్లను సానబెట్టాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. దీనికోసం యూనిస్ ఖాన్, మహ్మద్ యూసుఫ్‌లాంటి మాజీ క్రికెటర్ల వైపు చూస్తున్నది. గతేడాదే రిటైర్మెంట్ ప్రకటించిన యూనిస్ ఖాన్‌ను పాకిస్థాన్ అండర్ 19 టీమ్ కోచ్, మేనేజర్‌గా నియమిస్తారన్న వార్తలు ఇప్పటికే హల్‌చల్ చేస్తున్నాయి. 
 
పాకిస్థాన్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు, 10 వేల పరుగులు మైలురాయి అందుకున్న తొలి ప్లేయర్‌గా యూనిస్ ఖాన్‌కు పేరుంది. అలాంటి క్రికెటర్ తనకు కోచింగ్‌పై ఆసక్తి ఉందని కూడా చెప్పాడు. అయితే ఈ విషయంలో బోర్డు తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని మెలిక పెట్టాడు. ఆస్ట్రేలియా జట్టు కూడా రాడ్నీ మార్ష్, అలన్ బోర్డర్, రికీ పాంటింగ్‌లాంటి మాజీ క్రికెటర్ల సేవలను వినియోగించుకుంది. 
 
అలాగే ఇండియా కూడా ద్రవిడ్‌ను రంగంలోకి దించింది. భారత్ అండర్ 19, ఇండియా ఏ టీమ్స్‌కు కోచ్‌గా విజయవంతమయ్యాడు. అతని కోచింగ్‌లోనే గతేడాది ఇండియా అండర్ 19 వరల్డ్‌కప్ గెలిచింది. ఆస్ట్రేలియాలో బోర్డర్ సెలక్టర్‌గా, పాంటింగ్ ప్రస్తుత నేషనల్ టీమ్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నారు. అందుకే పాక్ కూడా మాజీలను రంగంలోకి దింపాలన్న నిర్ణయానికి దాదాపుగా వచ్చినట్టుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

తర్వాతి కథనం
Show comments