Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ శాంతికాముక దేశం... యుద్ధానికి నో చెప్పండి : షాహిద్ ఆఫ్రిదీ

యూరీ ముష్కర దాడికి ప్రతీకారంగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం స‌ర్జిక‌ల్ దాడులు చేప‌ట్ట‌డంతో రెండు దేశాల మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెలకొంది. ఎప్పుడు యుద్ధం జ‌రుగుతుందో తెలియ‌న

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2016 (15:16 IST)
యూరీ ముష్కర దాడికి ప్రతీకారంగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం స‌ర్జిక‌ల్ దాడులు చేప‌ట్ట‌డంతో రెండు దేశాల మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెలకొంది. ఎప్పుడు యుద్ధం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధ మేఘాలు క‌మ్ముకోవ‌డంతో సెల‌బ్రిటీలు జోక్యం చేసుకుంటున్నారు. ప‌రిస్థితి చేయి దాట‌క ముందే యుద్ధం రాకుండా అడ్డుక‌ట్ట వేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. 
 
తాజాగా పాక్ క్రికెట‌ర్ షాహిద్ అఫ్రిదీ కూడా ముందుకు వచ్చాడు. గ‌తంలో అఫ్రిదీ భార‌త్‌లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా తాను క్రికెట్ ఆడిన అన్ని దేశాలకంటే.. భారత్‌లో ఆడటమే గొప్పగా భావించానని గతంలో వ్యాఖ్యానించిన అఫ్రిదీపై స్వదేశంలో విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మ‌ధ్య చర్చల ద్వారా వివాదాలు ప‌రిష్క‌రించుకోవాల‌ని అన్నాడు. స‌మ‌స్య‌ల‌ను పరిష్కరించుకునే అవకాశం ఉండగా.. యుద్ధంలాంటి ప‌రిస్థితులు త‌లెత్తేలా వ్య‌వ‌హ‌రించ‌డం ఎందుకు? అని ప్ర‌శ్నించాడు. 
 
పాకిస్థాన్ శాంతికాముక దేశం అని.. ఇండియాతో పాకిస్థాన్ స‌త్సంబంధాలను కోరుకుంటోందని.. ఇరు దేశాల మ‌ధ్య‌ యుద్ధమే వస్తేగనుక భార‌త్‌, పాకిస్థాన్‌లు ఎంతో నష్టపోతాయని అన్న‌ాడు. 'యుద్ధానికి నో చెప్పండి' అని సూచించాడు. దీంతో రెండు దేశాలు శాంతికే మొగ్గు చూపాలని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. పొరుగు దేశాలతో పాక్‌ సహృద్భావ సంబంధాలు కోరుకుంటోందన్నాడు. ఇద్దరు పొరుగువారు గొడవ పడితే రెండిళ్లపైనా ప్రభావం పడుతుందని, యుద్ధం వద్దనాలని ట్వీట్‌ చేశాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments