Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పోటీలు : చెత్తగా ముగిసిన పాకిస్థాన్ జట్టు ప్రయాణం

ఠాగూర్
మంగళవారం, 28 జనవరి 2025 (14:09 IST)
ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ టోర్నీలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రయాణం అత్యంత చెత్తగా ముగిసింది. పాకిస్థాన్‌లోని ముల్తాన్ వేదికగా పర్యాటక వెస్టిండీస్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య పాక్ జట్టు చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ విండీస్ 120 పరుగుల తేడాతో గెలిచి 34 ఏళ్ల తర్వాత తొలిసారి పాక్ గడ్డపై విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. కరీబియన్ జట్టు చివరిసారి నవంబర్, 1990లో ఫైసలాబాద్‌లో జరిగిన టెస్టులో విజయం సాధించింది. ఆ తర్వాత 1997, 2006లో ఓటమి చవిచూసింది.
 
ఈ ఓటమితో పాకిస్థాన్ జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అట్టడుగుకు దిగజారిపోయింది. 2023/25 సైకిల్ 14 టెస్టులు ఆడిన పాక్ 5 మాత్రమే గెలిచి 9 టెస్టుల్లో పరాజయం పాలైంది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 27.89 శాతం పాయింట్లతో కింది నుంచి మొదటి స్థానంలో నిలిచింది. డబ్ల్యూటీసీ సైకిల్లో పాకిస్థాన్‌కు ఇదే అత్యంత చెత్త ప్రదర్శన.
 
డబ్ల్యూటీసీ ప్రారంభ ఎడిషన్‌లో ఆరు మ్యాచ్‌లలో మూడింటిలో గెలిచిన పాక్ 43.3 శాతం పాయింట్లు సాధించింది. ఆ తర్వాతి ఎడిషన్ (2021/23)లో నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి 38.1 పాయింట్ల శాతంతో ఏడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఏకంగా అట్టడుగున నిలిచింది. ప్రస్తుతం ఈ జాబితాలో సౌతాఫ్రికా 69.44 పాయింట్ల శాతంతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా (63.73), ఇండియా (50) వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

తర్వాతి కథనం
Show comments