Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రీడా రంగం నుంచి ఐదుగురికి పద్మ అవార్డులు...

ఠాగూర్
ఆదివారం, 26 జనవరి 2025 (12:58 IST)
భారతగణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం శనివారం రాత్రి పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో క్రీడా రంగం నుంచి ఐదుగురిని ఎంపిక చేసింది. వీరిలో భారత జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేషన్‌ను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ వరించింది.
 
అలాగే, ఇటీవల క్రికెట్‌కు టాటా చెప్పేసిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు పద్మశ్రీ లభించింది. ఇక ఫుట్‌బాల్ లెజెండ్ ఐఎం విజయన్‌కూ పద్మశ్రీ ప్రకటించారు. పారా ఆర్చర్ హర్విందర్ సింగ్, పారా అథ్లెటిక్ కోచ్ సత్యపాల్ సింగ్‌కు కూడా పద్మశ్రీ అవార్డులు లభించాయి.
 
ఇటీవలి బోర్డర్-గవాస్కర్ సిరీస్ సందర్భంగా ఆటకు వీడ్కోలు పలికాడు. 106 టెస్టులు ఆడిన 38 ఏళ్ల ఆశ్విన్ 537 వికెట్లతో సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్ రికార్డు నెలకొల్పాడు. 
 
అదేవిధంగా దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అందుకోనున్న 55 సంవత్సరాల ఐఎం విజయ‌న్ భారత గొప్ప ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఒకడు. కేరళకు చెందిన ఈ మాజీ ఫార్వర్డ్ 2000 నుంచి 2004 వరకు భారత ఫుట్‌బాల్ జట్టు సారథిగా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. విజయన్ 12 మ్యాచ్ 29 అంతర్జాతీయ గోల్స్ చేశాడు.
 
హర్యానాకు చెందిన  33 ఏళ్ల హర్విందర్ సింగ్ పారా ఆర్చర్. టోక్యో పారాలింపిక్స్‌లో రికర్వ్ ఓపెన్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలుచుకున్న ఈ స్టార్.. గత యేడాది జరిగిన పారిస్ క్రీడల్లో పసిడి పతకం కొల్లగొట్టి చరిత్ర సృష్టించాడు. ఇక.. పారిస్ పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ఖేల్ రత్న అవార్డీ హైజంపర్ ప్రవీణ్ కుమార్‌ను తీర్చిదిద్దడంలో సత్యం - పాల్ సింగ్ కీలకపాత్ర పోషించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments