Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పద్మ పురస్కారాలకు ఎంపికైనవారికి హృదయపూర్వక అభినందనలు

Advertiesment
Pawan kalyan

ఠాగూర్

, ఆదివారం, 26 జనవరి 2025 (09:04 IST)
ఐదు దశాబ్దాలపైబడి తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషదాయకమని ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భారత రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వీరిలో తెలుగు ప్రముఖులు అనేక మంది ఉన్నారు. వీరిలో సినీ నటుడు బాలకృష్ణకూడా ఉన్నారు. ఈయనకు పద్మభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. 
 
దీనిపై పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన చేశారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన బాలకృష్ణ హిందూపురం శాసన సభ్యుడిగా, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా ఎన్నో సేవలందిస్తున్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో పలు పరిశోధనలు చేసిన డా.డి.నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్‌కు ఎంపికైనందుకు అభినందనలు తెలుపుతున్నాను. 
 
ప్రజా ఉద్యమాల్లో మంద కృష్ణ మాదిగకి ప్రత్యేక స్థానం ఉంది. ఎం.ఆర్.పి.ఎస్. ద్వారా మాదిగలకు రిజర్వేషన్ కోసం పోరాడారు. అనారోగ్యంతో బాధపడే పిల్లలకు ప్రభుత్వ వైద్య సహాయం కోసం, వికలాంగుల కోసం ప్రజా పోరాటాలు చేశారు. మంద కృష్ణ మాదిగ పద్మశ్రీ‌కు ఎంపికైనందుకు అభినందనలు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సహస్రావధాని, కవి మాడుగుల నాగఫణి శర్మ, సాహిత్యం-విద్య విభాగంలో ఎంపికైన కె.ఎల్.కృష్ణ, వి.రాఘవేంద్రాచార్య పంచముఖికి అభినందనలు తెలుపుకుంటున్నాను. 
 
మట్టిలో మాణిక్యాలాంటి వారికి పద్మ పురస్కారాలు అందిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది 30 మంది ఈ విధంగా ఎంపికైనవారు ఉండటం సంతోషాన్ని కలిగించింది. మన రాష్ట్రానికి చెందిన బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుకి మరణానంతరం పద్మశ్రీకి ఎంపికయ్యారు. వారి కళా సేవకు తగిన గుర్తింపు దక్కిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొరుగింటి మగాడితో పడక సుఖానికి బానిసైన భార్య.. అడొస్తున్న భర్తను చంపేసింది..