Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ 20 ప్రపంచ కప్ ఫైనల్ పోరు : టాస్ గెలిచిన ఆసీస్ - కివీస్ బ్యాటింగ్

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (19:30 IST)
దుబాయ్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరు ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 
 
అయితే, న్యూజిలాండ్ జట్టు తొలిసారి పొట్టి కప్పులో తుది పోరు ఆడబోతుండగా, ఆసీస్‌కిది రెండో ఫైనల్ కావడం గమనార్హం. గత 2015 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓడిన కివీస్‌.. ఇప్పుడా జట్టుపై ప్రతీకారం తీర్చుకుని ఈ ఏడాది రెండో ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని భావిస్తుంది. 
 
ఇప్పటికే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచిన విలియమ్సన్‌ సేన అదే ఊపులో పొట్టి కప్పునూ పట్టేయాలనుకుంటోంది. 2010 ఫైనల్లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిన ఆసీస్‌.. ఈ సారి మాత్రం ట్రోఫీని వదలకూడదనే గట్టిపట్టుదలతో ఉంది. 
 
ఈ మ్యాచ్ కోసం కంగారులు జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. పాకిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడిన జట్టునే బరిలోకి దించారు. అయితే, కివీస్​ జట్టులో గాయం కారణంగా కాన్వే తప్పుకోగా, అతడి స్థానంలో టిమ్ సీఫర్ట్​ చేరాడు.
 
ఇరు జట్ల వివరాలు.. 
న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టిమ్ సీఫర్ట్​ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్​, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడం మిల్నే, టిమ్​ సౌథీ, ఇష్​ సోధీ, ట్రెంట్ బౌల్ట్.
 
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్​వెల్, మార్కస్ స్టోయినిస్, మ్యాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్​, మిచెల్ స్టార్క్, ఆండం జంపా, జోష్ హేజిల్​వుడ్. 

సంబంధిత వార్తలు

నదిలో దూకిన ప్రేమజంట.. కాపాడి చెంప పగలగొట్టి ప్రియుడి చెంప పగలగొట్టిన జాలరి!!

క్లాప్ పేరుతో చెత్త పన్ను వసూలు చేసిన వైకాపా ప్రభుత్వం.. రద్దు చేసిన టీడీపీ సర్కారు!

బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి - సురక్షితంగా తొలగించిన వైద్యులు

నెరవేరిన శపథం... సీఎంగా చంద్రబాబు - ఐదేళ్ళ తర్వాత పుట్టింటికి మహిళ!

పిన్నెల్లి సోదరులపై మాచర్ల పోలీసుల రౌడీషీట్!!

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments