Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేయి విరగ్గొట్టుకుని టీ20 ఫైనల్‌కు దూరమైన కివీస్ బ్యాట్స్‌మెన్!

Advertiesment
చేయి విరగ్గొట్టుకుని టీ20 ఫైనల్‌కు దూరమైన కివీస్ బ్యాట్స్‌మెన్!
, శనివారం, 13 నవంబరు 2021 (10:17 IST)
దుబాయ్ వేదికగా ఈ నెల 14వ తేదీ ఆదివారం రాత్రి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోటీ జరుగనుంది. అయితే, కీలకమైన ఈ ఫైనల్ మ్యాచ్‌కు కివీస్ ఆటగాడు దూరమయ్యాడు. ఫలితంగా న్యూజిలాండ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. 
 
ఆ జట్టు కీలక బ్యాట్స్‌మన్‌ డెవాన్‌ కాన్వే గాయంతో తుది సమరానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో 167 పరుగుల ఛేదనలో కాన్వే విలువైన 46 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఔటైన తర్వాత అసహనంతో బ్యాట్‌తో కుడి చేతికి పొరపాటున కొట్టుకోవడంతో గాయమైంది. దీంతో అతడు ఫైనల్‌తో పాటు రాబోయే భారత్‌తో టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. 
 
'అనూహ్యంగా అయిన గాయం కారణంగా ఫైనల్‌ ఆడలేకపోవడం కాన్వేను చాలా బాధిస్తోంది. ఈ గాయం అనుకోకుండా జరిగింది. ప్రపంచకప్‌తో పాటు భారత్‌తో టీ20 సిరీస్‌లకు కాన్వేకు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేయలేదు. అయితే టీమ్‌ఇండియా టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉన్న ఆటగాళ్లను పరిశీలిస్తున్నాం' అని కివీస్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్ని ఫార్మెట్ల కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై : రవిశాస్త్రి