ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ : భారత్ వేదికగా ఫైనల్ మ్యాచ్

ఠాగూర్
బుధవారం, 22 అక్టోబరు 2025 (12:19 IST)
Womens World Cup 2025
మహిళల వన్డే ప్రపంచకప్ లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే మూడు టీమ్లు సెమీస్‌కు చేరుకోగా.. నాలుగో బెర్తు ఖరారు కావాల్సి ఉంది. తమకు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్, పాకిస్థాన్ నిష్క్రమించాయి. ఇక భారత్, న్యూజిలాండ్, శ్రీలంక టాప్-4లోకి వచ్చేందుకు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌ మ్యాచ్ కూడా భారత్ వేదికగానే జరుగనుంది. 
 
నవీ ముంబై ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఐసీసీకి వెసులుబాటు దక్కింది. ఒకవేళ పాక్ ఫైనల్‌కు చేరుకునివుంటే ఆ మ్యాచ్‌ను కొలంబోలో నిర్వహించాల్సి ఉండేది. ఇప్పుడు లీగ్ స్టేజ్‌లోనే నిష్క్రమించడంతో ఫైనల్ భారత్‌లోనే జరుగనుంది.

తొలి సెమీస్ (అక్టోబర్ 29)కు ఇంకా వేదికను ఖరారు చేయలేదు. ఆ మ్యాచ్‌కు ఇండోర్ ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది. రెండో సెమీస్ (అక్టోబరు 30) నవీ ముంబైలోనే జరగనుంది. నవంబర్ 2న మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సపోటా తోటలో మైనర్ బాలికపై తుని టీడీపీ లీడర్ అత్యాచారయత్నం

తమిళనాడులో భారీ వర్షాలు.. చెన్నైలో మూతపడిన పాఠశాలలు

రాష్ట్రపతికి తప్పిన పెనుముప్పు - బురదలో కూరుకుపోయిన హెలికాఫ్టర్

Mana Mitra App: మన మిత్ర మొబైల్ యాప్‌ను ప్రారంభించిన చంద్రబాబు

తొలిసారి భార్య భారతితో దీపావళి జరుపుకున్న వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి (ఫోటోలు)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

తర్వాతి కథనం
Show comments