Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై ఇండియన్స్‌కు షాక్.. గాయం కారణంగా స్టార్ పేసర్ దూరం!!

ఠాగూర్
మంగళవారం, 19 మార్చి 2024 (09:34 IST)
ఈ నెల 22వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్2024 పోటీలు ప్రారంభంకానున్నాయి. ప్రారంభ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరుగనుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేస్ బౌలర్ జాన్స్ బెహ్రెన్ డార్ఫ్ గాయం కారణంగా జట్టు నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో ఇంగ్లండ్ పేసర్ ల్యూక్‌ను జట్టులోకి తీసుకున్నట్టు ముంబై ఇండియన్స్ యామాజన్యం ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా సోమవారం అప్‌డేట్ చేసింది. ల్యూక్ ఉడ్ ఎడమచేతి వాటం పేసర్. ఇంగ్లండ్ జాతీయ జట్టు తరపున రెండు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టీ20 మ్యాచ్‌లలో ఎనిమిది వికెట్లు నేలకూల్చాడు. ఉడ్‌ను ముంబై ఇండియన్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. 
 
అయితే, ల్యూక్ ఉండే ఇంగ్లండ్ తరపున కేవలం ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడినప్పటికీ దేశవాళీ, టీ20 ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో అద్భుతమైన గణాంకాలు కలిగివున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ 2024లో ఆడుతున్నాడు. బాబర్ అజమ్ సారథ్యంలో వెషావర్ జల్మీ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ యేడాది 11 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు పడగొట్టాడు. కాగా గత యేడాది ముంబై ఇండియన్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా అర్చర్ వంటి కీలకమైన ఆటగాళ్లు లేకపోయినప్పటికీ జాసన్ పేస్ బౌలింగ్‌ దళాన్ని ముందుండి నడిపించాడు. కానీ ఇపుడు గాయం కారణంగా జట్టుకు దూరం కావడం పెద్ద లోటుగా చెప్పుకోవచ్చు. 
 
ముంబై ఇండియన్స్ జట్టు : రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, టీమ్ డేవిడ్, తిలక్ వర్మ, అర్జన్ టెండూల్కర్, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వల్, నెహాల్ వధేరా, షమ్స్ ములానీ, విష్ణు వినోద్, పియూష్ చావ్లా, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్టి, దిల్షన్ మదుశంక, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, అన్షుల్ కాంబోజ్, నమన్ ధీర్, మొహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ, ల్యూక్ ఉడ్‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

YSRCP: జెడ్‌పిటిసి ఉప ఎన్నికలు: వైకాపా పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

తర్వాతి కథనం
Show comments