Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్ రూల్స్ బ్రేక్ చేసిన సురేష్ రైనా - అరెస్టు.. విడుదల

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (14:35 IST)
భారత క్రికెట్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్ సురేష్ రైనా చిక్కుల్లో పడ్డారు. ఆయనపై పబ్ రూల్స్ బ్రేక్ చేసినందుకు కేసు నమోదైంది. దీంతో ఆయన్ను అరెస్టు చేసి, ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ముంబై ఎయిర్ పోర్టు సమీపంలోని 'డ్రాగన్ ఫ్లై పబ్'ను నిర్వాహకులు తెరిచి ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. 
 
ఈ పబ్‌పై దాడులు చేసిన ముంబై పోలీసులు అక్కడ ఎంజాయ్ చేస్తున్న సురేశ్ రైనా, గాయకుడు గురు రణధావా సహా 34 మందిని అరెస్టు చేశారు. అనంతరం వీరిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.
 
కాగా, అరెస్టయిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ అర్థాంగి సుజానే ఖాన్ కూడా ఉన్నారు. నిర్దేశించిన సమయం మించి పబ్ తెరిచి ఉంచారని, ఇతరత్రా నియమాల ఉల్లంఘన కూడా జరిగిందని అరెస్టు సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు. 
 
కాగా, సురేష్ రైనా తన అంతర్జాతీయ క్రికెట్‌కు గత ఆగస్టు 15వ తేదీన రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెల్సిందే. సురేష్ రైనా 18 టెస్టులు, 226 వన్డే మ్యాచ్‌లు 78 ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

తర్వాతి కథనం
Show comments