Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిగత రికార్డులు బద్ధలుకొడుతున్న ధోనీ!

ఠాగూర్
శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (11:57 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన వ్యక్తిగత రికార్డులను అధిగమిస్తున్నాడు. ప్రస్తుతం స్వదేశంలో ఐపీఎల్ 18 సీజన్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో ఐపీఎల్ జట్టు తరపున రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, ఆయన మోచేతికి గాయం కావడంతో జట్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో జట్టు సారథ్య బాధ్యతలను మళ్లీ ధోనీకే అప్పగించారు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక వయసున్న కెప్టెన్‌గా ధోనీ రికార్డు సాధించాడు. 
 
శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరుగనున్న మ్యాచ్‌‍కు ధోనీ స్కిప్పర్‌గా వ్యవహరిస్తాడని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించాడు. మరోవైపు, రుతురాజ్ గైక్వాడ్ దూరం కావడంతో జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. ఇప్పటికే ఆ జట్టు ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో ఓటమిని చవిచూసింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో నిలించింది. 
 
గౌహతిలో గత నెల 30వ తేదీన రాజస్థాన్ రాయల్స్‍తో జరిగిన మ్యాచ్‌‍లో గైక్వాడ్ గాయపడ్డాడు. గైక్వాడ్ మోచేతిలో ఉన్న ఫ్రాక్చర్ ఉన్నట్టు ఫ్లెమింగ్ తెలిపాడు. మిగిలిన మ్యాచ్‌లలో ఆడేందుకు గైక్వాడ్ ప్రయత్నించినా దురదృష్టవశాత్తూ వీలు కాలేదన్నాడు. ఇప్పటి వరకైతే అతడు టోర్నీకి దూరమైనట్టేనని పేర్కొన్నాడు. కాబడ్డి మిగతా మ్యాచ్‌లకు ధోనీ సారథ్యం వహిస్తాడని చెప్పాడు. 
 
శుక్రవారం మ్యాచ్‌కు ధోనీ సారథ్యం వహిస్తే అతడి ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరుతుంది. ఐపీఎల్‌లో అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా రికార్డుకెక్కుతాడు. ధోనీ వయసు శుక్రవారం 43 సంవత్సరాల 278 రోజులు. 2023లో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌కు ధోనీ 41 సంవత్సరాల 325 రోజుల వయసులో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పటివరకు ఇదే రికార్డు కాగా, ఇపుడు 43 యేళ్ల వయసులో జట్టుకు సారథ్యం వహిస్తున్న తొలి కెప్టెన్‌గా రికార్డును సొంతం చేసుకోబోతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

తర్వాతి కథనం
Show comments