ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో మహేంద్ర సింగ్ ధోని మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఐపీఎల్ 2025లో సీఎస్కేకి నాయకత్వం వహించిన గైక్వాడ్, ఈ సీజన్ ప్రారంభంలో గౌహతిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కుడి ముంజేయికి దెబ్బ తగిలింది. తరువాత స్కాన్లలో మోచేయి విరిగినట్లు వెల్లడైంది. దీంతో ధోనీకి తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు.
శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు సీఎస్కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ వార్తలను కెప్టెన్సీ మార్పును ధృవీకరించారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్ తర్వాత ధోని కెప్టెన్‌గా ఇది మొదటి మ్యాచ్ అవుతుంది.
ధోని సీఎస్కే జట్టును రికార్డు స్థాయిలో 235 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. వాటిలో ఫ్రాంచైజీ సాధించిన ఐదు టైటిల్ విజయాలన్నీ ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క మ్యాచ్‌తో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.