Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ బయోపిక్: రూ.60 కోట్లు అడిగిన మహి.. పెప్సీకో గోవిందా.. బ్రాండ్ వాల్యూ డౌన్.. అందుకేనా?

భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎదిగిన మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. "ఎమ్ఎస్ ధోని - ద అన్‌టోల్డ్ స్టోరీ" పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా సుశాంత్ రాజ్‌పుత్ నటిస్తు

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2016 (17:27 IST)
భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎదిగిన మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. "ఎమ్ఎస్ ధోని - ద అన్‌టోల్డ్ స్టోరీ" పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా సుశాంత్ రాజ్‌పుత్ నటిస్తుండగా.. అతడికి భార్యగా కైరా అద్వానీ చేస్తోంది. నీరజ్ పాండే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం ధోనీ కొంత మొత్తాన్ని చెల్లించాలని చార్జ్ చేశాడట. 
 
తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ధోనీ ఏకంగా రూ.60కోట్లు చార్జ్ చేశాడంటే నమ్ముతారా? నమ్మితీరాల్సిందే. ఈ మొత్తాన్ని ధోనీకి ఇస్తారా? సినిమా రిలీజ్ కాకముందే ఇస్తారా? తర్వాత ఇస్తారా? అనేది క్లారిటీ లేదు. దీనిపట్ల ధోనీపై విమర్శలు కూడా వస్తున్నాయి. తన బయోపిక్ రావడంపై సంతోషపడాల్సింది పోయి.. తనపై వచ్చే సినిమా కావడంతో డబ్బులు గుంజడం సరైంది కాదని కొందరు అంటున్నారు. 
 
ఏదైతేనేం సినిమాలో నటించకున్నా భారీ పారితోషికాన్ని అందుకోబోతున్నాడు ధోనీ అంటూ మరికొందరు అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా విడుదలై ఎన్ని వసూళ్లు తెచ్చిపెడుతుందో తెలియాలంటే సెప్టెంబరు 30 వరకు వేచి చూడాల్సిందే. 
 
హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లిష్ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తారు. ట్రైలర్ చూసిన వెంటనే ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వస్తాయని ధోనీ ముందుగానే పసిగట్టాడని.. అందుకే కొంత మొత్తాన్ని ముందుగానే ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసినట్లు బాలీవుడ్‌లో టాక్. అంతేగాకుండా తనకు ఉండిన బ్రాండ్ వాల్యూ కూడా మెల్లమెల్లగా తగ్గిపోవడంతోనే.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ధోనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఎందుకంటే.. పెప్సీకో ధోనీని పక్కన బెట్టి కొత్త ఐకాన్‌గా కోహ్లీని ఎంచుకోవడమే. ధోనీతో 11 ఏళ్ల వాణిజ్య బంధానికి గుడ్ బై చెప్పేసిన పెప్సీకో ఆ స్థానాన్ని విరాట్ కోహ్లీకి కట్టబెట్టేసింది. వయసు మీద పడటంతో పాటు ధోనీ టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలకడంతో పెప్సీ బ్రాండ్ అంబాసిడర్‌ను మార్చేసిందని క్రికెట్ పండితులు అంటున్నారు. అంతేగాకుండా విరాట్ కోహ్లీ క్రేజ్ మరింత పెరిగిపోవడంతో వాణిజ్య సంస్థలన్నీ ప్రస్తుతం కోహ్లీ వైపు చూస్తున్నాయని వారు చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

AP Assembly Sessions: ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరవుతారా?

లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్ రెడ్డి ధ్వజం

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై సజ్జనార్ సీరియస్.. నానికి కితాబ్.. మారకపోతే అంతే సంగతులు

పట్టపగలు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కన్నతండ్రిని పొడిచి చంపేసిన కొడుకు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

తర్వాతి కథనం
Show comments