Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్ ఒలింపిక్స్ : రెజ్లర్ యోగేశ్వర్‌కు మెడల్ అప్‌గ్రేడ్...

లండ‌న్ ఒలింపిక్స్‌లో కాంస్య ప‌త‌కం సాధించిన భారత మల్లయుద్ధ వీరుడు (రెజ్ల‌ర్) యోగేశ్వ‌ర్ దత్‌కు మెడ‌ల్‌ను అప్‌గ్రేడ్ చేయ‌నున్నారు. లండన్ క్రీడ‌ల్లో రెజ్లింగ్ ఈవెంట్‌లో ర‌జ‌తం సాధించిన ర‌ష్యా అథ్లెట్ బె

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2016 (15:56 IST)
లండ‌న్ ఒలింపిక్స్‌లో కాంస్య ప‌త‌కం సాధించిన భారత మల్లయుద్ధ వీరుడు (రెజ్ల‌ర్) యోగేశ్వ‌ర్ దత్‌కు మెడ‌ల్‌ను అప్‌గ్రేడ్ చేయ‌నున్నారు. లండన్ క్రీడ‌ల్లో రెజ్లింగ్ ఈవెంట్‌లో ర‌జ‌తం సాధించిన ర‌ష్యా అథ్లెట్ బెసిక్ కుడుకోవ్ డ్ర‌గ్ ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలింది. దాంతో యోగేశ్వ‌ర్ ద‌త్‌కు మెడల్‌ను అప్‌గ్రేడ్ చేశారు. 
 
నాలుగుసార్లు వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్‌, రెండుసార్లు ఒలింపిక్ ప‌త‌కాలు గెలుచుకున్న రెజ్ల‌ర్ కుడ్‌కోవ్ 2013లో జ‌రిగిన కారు ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు. అయితే ఆ రెజ్ల‌ర్ శ్యాంపిల్స్ టెస్ట్ చేసిన వ‌ర‌ల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అతన్ని పాజిటివ్‌గా తేల్చింది. దీనికి సంబంధించిన అంశంపై ర‌ష్యా ఏజెన్సీ ఫ్లోరెజ్లింగ్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఆ ఆధారంగానే భార‌తీయ రెజ్ల‌ర్ యోగేశ్వ‌ర్ ద‌త్‌కు మెడ‌ల్‌ను అప్‌గ్రేడ్ చేసినట్టు సమాచారం. 
 
లండ‌న్ గేమ్స్‌లో 60 కేజీల విభాగంలో యోగేశ్వర్ కాంస్య ప‌త‌కం సాధించాడు. అప్‌గ్రేడ్ చేయ‌డం వ‌ల్ల యోగేశ్వ‌ర్ ఖాతాలో ర‌జ‌త ప‌త‌కం చేరుతుంది. అదే లండ‌న్ గేమ్స్‌లో మ‌రో రెజ్ల‌ర్ సుశీల్ కుమార్ కూడా ర‌జ‌త ప‌త‌కం గెలుచుకున్న విష‌యం తెలిసిందే. తన మెడల్‌ను అప్ గ్రేడ్ చేసినట్లు యోగేశ్వర్ మంగళవారం తన ట్విట్టర్ అకౌంట్లో స్పష్టం చేశాడు. కాంస్య పతకం నుంచి రతజ పతకంగా మారుతుందని వార్తలు వచ్చిన తర్వాత యోగేశ్వర్ స్పందించాడు. లండన్ గేమ్స్‌లో వచ్చిన మెడల్‌ను సిల్వర్‌గా అప్ గ్రేడ్ చేసినట్లు తెలిసిందని, నా పతకాన్ని దేశ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు యోగేశ్వర్ ట్వీట్ చేశాడు.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

తర్వాతి కథనం
Show comments