Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ సిక్సుల మోత.. కొత్త రికార్డ్.. కోహ్లీ కూడా తీసిపోలేదు..

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (11:44 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సరికొత్త రికార్డులతో అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ-20 క్రికెట్ సిరీస్‌లో ధోనీ కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో 350 సిక్సర్లు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా ధోనీ రికార్డు సాధించాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాది.. ఆల్ టైమ్ హైయెస్ట్ స్కోర్ సాధించిన ఆటగాళ్లలో ధోనీ ఐదో స్థానంలో నిలిచాడు. 
 
ఈ రికార్డును బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో ధోనీ తన ఖాతాలో వేసుకున్నాడు.. ధోనీ. ఆల్ టైమ్ హైయెస్ట్ స్కోర్ సిక్సుల జాబితాలో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 492 సిక్సులతో అగ్రస్థానంలో నిలవగా, పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ షాహిద్ అఫ్రిద్ 476 సిక్స్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. అలాగే తర్వాతి స్థానాల్లో మెక్ కల్లమ్ (398 సిక్సులు), శ్రీలంక లెజండ్ సనత్ జయసూర్య (352), ఆ తర్వాతి స్థానంలో ధోనీ 350 సిక్సులతో నిలిచాడు. 
 
ఇక ధోనీ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ-20లో 23 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. అయితే ఆస్ట్రేలియన్ బౌలర్లు ధోనీ ఖాతాలో టీ-20ల్లో 20వ అర్థ సెంచరీని నమోదు చేయనీయకుండా అడ్డుకున్నారు. ఇదేవిధంగా బెంగళూరులో జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధికం (20)గా 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా రోహిత్‌తో కలిసి టాప్‌లో నిలిచాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ. అలాగే ఎక్కువ ఫోర్లు (223) బాదిన క్రికెటర్‌గానూ దిల్షాన్‌తో కలిసి కోహ్లీ అగ్రస్థానంలో వున్నాడు. 
 
ఇకపోతే.. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన టీ20ల్లో ఎక్కువ సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా కోహ్లీ (104) నిలవగా, తొలి స్థానంలో గేల్ (150) ఉన్నాడు. భారత ఆటగాళ్లే కాకుండా ఆస్ట్రేలియా ఆటగాళ్లలో మ్యాక్స్ వెల్ కూడా ఈ టీ20 మ్యాచ్‌లో రికార్డు సృష్టించాడు. భారత్‌ గడ్డపై టీమిండియా జట్టుపై టీ20ల్లో సెంచరీ చేసిన రెండో విదేశీ ఆటగాడిగా మ్యాక్స్‌‍వెల్ నిలిచాడు. కానీ భారత్ మాత్రం నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో టీ20 సిరీస్‌ను కోల్పోయిన జట్టుగా భారత్. కాగా 2015లో దక్షిణాఫ్రికాపై 0-2 తేడాతో భారత్ పరాజయాన్ని మూటగట్టుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలుకు - ఫ్లాట్‌ఫామ్ ‌మధ్య పడిన యువతి.. మెరుపువేగంతో స్పందించిన కానిస్టేబుల్... (వీడియో)

Hyderabad: భర్తతో గొడవ- అపార్ట్‌మెంట్‌లో 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

కర్నూలులో దారుణం.. కాలు నరికి అందరికీ చూపించాడు...

15 రోజుల పసికందును లోకల్ రైలులో వదిలి పారిపోయిన మహిళ.. తర్వాత ఏం జరిగింది?

మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్.. నిందితుల్లో డీన్స్ కుమారుడు? 25 మందిపై సస్పెన్షన్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments