Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుదైన గౌరవానికి అల్లంత దూరంలో.. ఇది మిథాలీ షో టైమ్

ఒక భారతీయ మహిళా క్రికెటర్ ప్రపంచ క్రీడా యవనికలో శిఖర స్థాయిలో నిలవనున్న క్షణాలివి. అన్నీ అనుకూలిస్తే... ఇదే భీకర్ ఫామ్‌ను ఆమె ఇలాగే కొనసాగిస్తే ఈ ప్రపంచ కప్ ఫైనల్ ముగిసేలోగానే వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం చేరుకోవచ్చు. ఆ అరుదైన క్షణాల కోస

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (01:41 IST)
ఒక భారతీయ మహిళా క్రికెటర్ ప్రపంచ క్రీడా యవనికలో శిఖర స్థాయిలో నిలవనున్న క్షణాలివి. అన్నీ అనుకూలిస్తే... ఇదే భీకర్ ఫామ్‌ను ఆమె ఇలాగే కొనసాగిస్తే ఈ ప్రపంచ కప్ ఫైనల్ ముగిసేలోగానే వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం చేరుకోవచ్చు. ఆ అరుదైన క్షణాల కోసం దేశంలోని క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. 
 
భారత మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంకును సొంతం చేసుకునేందుకు అతి కొద్ది దూరంలో నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజా వన్డే ర్యాంకింగ్స్  జాబితాలో మిథాలీ రాజ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. అదే సమయంలో టాప్‌కు చేరడానికి ఐదు పాయింట్ల దూరంలో నిలిచింది మిథాలీ. ప్రస్తుతం 774 రేటింగ్ పాయింట్లతో మిథాలీ రెండోస్థానంలో నిలిచింది.
 
మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మిథాలీ ఆకట్టుకుంది. అంతకుముందు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. తద్వారా తన రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపరుచుకుని నంబర్ వన్‌కు చేరువగా వచ్చింది. 
 
నంబర్ వన్ ర్యాంకులో నిలవడానికి కేవలం ఐదు పాయింట్ల దూరంలో మిథాలీ నిలిచింది.  ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (779) టాప్ లో కొనసాగుతోంది. ఇదిలా ఉంచితే, మిగతా భారత మహిళా క్రికెటర్లు ఎవరూ టాప్-10లో నిలవక పోవడం గమనార్హం.
 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments