Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరిత్ర సృష్టించిన ఫెదరర్... ఖాతాలో 19 గ్రాండ్‌శ్లామ్ టైటిల్స్

స్విస్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక వింబుల్డెన్ టెన్నిస్ టోర్నీ విజేతగా మరోమారు నిలిచాడు. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో క్రొయేషియా క్రీడాకారుడు మారిన

Webdunia
సోమవారం, 17 జులై 2017 (09:55 IST)
స్విస్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక వింబుల్డెన్ టెన్నిస్ టోర్నీ విజేతగా మరోమారు నిలిచాడు. వింబుల్డన్ పురుషుల సింగిల్స్  ఫైనల్స్‌లో క్రొయేషియా క్రీడాకారుడు మారిన్ సిలిక్‌పై ఘన విజయం సాధించాడు. సిలిక్‌పై 6-3, 6-1, 6-4 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. ఈ విజయంతో ఫెదరర్ కెరీర్‌లో 8వ వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ సాధించినట్టయింది. 
 
గతంలో ఈ తరహా అరుదైన ఫీట్‌ను సంప్రాస్ వింబుల్డన్ సాధించాడు. తాజా విజయంతో ఫెదరర్ ఈ రికార్డును అధిగమించాడు. దీంతో, అత్యధిక వింబుల్డన్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా ఫెదరర్ చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా, వింబుల్డన్ గెలిచిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించిన ఫెదరర్ ఖాతాలో 19వ గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను వేసుకున్నాడు. 
 
కాగా, 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012లో వింబుల్డన్ టైటిళ్లను ఫెదరర్ సాధించాడు. 2012లో ఆండీ ముర్రేను ఓడించి, వింబుల్డన్ టైటిల్‌ను ఫెదరర్ సొంతం చేసుకున్నాడు. 2014, 2015 వింబుల్డన్ సింగిల్స్‌లో ఫెదరర్ రన్నరప్‌గా నిలిచాడు. ఈ విజయంతో రోజర్ ఫెదరర్‌ టైటిల్‌తో పాటు రూ.18.5 కోట్ల ప్రైజ్‌మనీని కూడా అందుకున్నాడు.
 
ఈ విజయంపై ఫెదరర్ స్పందిస్తూ.. నేను ఈ స్థాయికి ఎదుగుతానని ఊహించలేదు. 2014, 15 ఫైనల్స్‌లో నొవాక్‌ చేతిలో ఓటమి అనంతరం గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నా. గతేడాది సెమీస్‌లో వెనుదిరిగాక మరోసారి ఫైనల్‌కు వస్తానని ఊహించలేదు. కానీ.. ఎప్పుడూ నమ్మకం కోల్పోకుండా పోరాడాను. ఇప్పుడిలా మీ ముందు నిలవడం నిజంగా అద్భుతం. ఇది ప్రత్యేకమైన కోర్టు. ఎంతోమంది దిగ్గజాలు తమ ముద్ర వేశారు. ఈ రోజు సిలిక్‌తో కలిసి టెన్నిస్‌ను ఆస్వాదించడం మరెంతో ప్రత్యేకం. మారిన్‌ బాగా పోరాడాడు. అతను ఒక హీరో. అద్భుతమైన టోర్నమెంట్‌ ఆడిన అతనికి శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments