Webdunia - Bharat's app for daily news and videos

Install App

రషీద్ లతీఫ్‌కు తివారీ స్ట్రాంగ్ వార్నింగ్.. చెప్పులతో కొట్టి బుద్ధి చెప్తారు.. చెవుల్లోంచి రక్తం కారి చస్తావ్!

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్‌కు టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ ఘాటుగా హెచ్చరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై గెలిచిన అనంతరం తండ్రి తండ్రి అవుతాడు.. బిడ్డ బిడ్డ అవుతాడు.. అంటూ డాషిం

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (18:04 IST)
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్‌కు టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ ఘాటుగా హెచ్చరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై గెలిచిన అనంతరం తండ్రి తండ్రి అవుతాడు.. బిడ్డ బిడ్డ అవుతాడు.. అంటూ డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. దీనిపై పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ తీవ్రంగా స్పందించాడు. 
 
నజాఫ్ గడ్ నుంచి సెహ్వాగ్ వచ్చాడని, నజాఫ్ అనే వ్యక్తి ముస్లిం అని, అతని పేరుతో నజాఫ్ గఢ్ పేరు వచ్చిందని, నజాఫ్ గడ్ వాసులందరికీ అతనే తండ్రి అని... శ్రీలంక మీద ఓడిపోయిన టీమిండియాకు ఎవడు తండ్రి అంటూ అభ్యంతరకరంగా విమర్శలు చేశాడు. దీనిపై మనోజ్ తివారీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. మరోసారి ఇలాంటి వీడియో అప్ లోడ్ చేస్తే చెప్పులతో కొట్టి బుద్ధి చెబుతారని హెచ్చరించాడు. 'నీలాంటి భాషే మేము కూడా వాడితే చెవుల్లోంచి రక్తం కారి చస్తావు' అంటూ హెచ్చరించాడు.
 
అంతేకాకుండా భారత్‌లో ఉన్న డాన్ లంతా తమ (ముస్లింలే) వారేనని... ఇప్పటికి ఉన్నవారు సరిపోరంటే.. తాను కూడా వస్తానని... అప్పుడు ఎవడు తండ్రో?, ఎవడు బిడ్డో? తేలిపోతుందని రెచ్చగొట్టాడు. దీనిపై యువ ఆటగాడు మనోజ్ తివారీ స్పందించాడు. రషీద్ లతీఫ్‌ని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడమని హెచ్చరించాడు.
 
పాకిస్థానీలకు ఇంగ్లీష్ రాదన్న విషయాన్ని గుర్తు చేస్తూ...'ఎవడైనా ఇంగ్లిష్ తెలిసినవాడిని పక్కనపెట్టుకుని ఓసారి గూగుల్‌లో సెహ్వాగ్ కొట్టిన పరుగులు, నువ్వు కొట్టిన పరుగులు సరిచూసుకో... అప్పుడైనా నీ స్థాయి ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు సెహ్వాగ్‌కు సమాధానం చెప్పేంత గొప్పవాడివా?' అని ప్రశ్నించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

తర్వాతి కథనం
Show comments