Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెంచ్ ఓపెన్ : రఫెల్ నాదల్ ఖాతాలో పదో టైటిల్

ఫ్రెంచ్ ఓపెన్‌ టోర్నీలో అద్భుతం చోటుచేసుకుంది. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తన ఖాతాలో పదో టైటిల్‌ను వేసుకున్నాడు. కెరీర్‌లో 15 గ్రాండ్ స్లామ్ టోర్నీలు సాధించిన రఫెల్ నాదల్... క్లే కోర్టులో రారాజు తానేనని

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (15:24 IST)
ఫ్రెంచ్ ఓపెన్‌ టోర్నీలో అద్భుతం చోటుచేసుకుంది. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తన ఖాతాలో పదో టైటిల్‌ను వేసుకున్నాడు. కెరీర్‌లో 15 గ్రాండ్ స్లామ్ టోర్నీలు సాధించిన రఫెల్ నాదల్... క్లే కోర్టులో రారాజు తానేనని మరోసారి నిరూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో స్విట్జర్లాండ్‌‌కు చెందిన వావ్రింకాను 6-2, 6-3, 6-1 తేడాతో వరుస సెట్లలో ఓడించి సరికొత్త రికార్డును సృష్టించాడు. దీంతో పది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ సాధించిన ఏకైక టెన్నిస్ ఆటగాడిగా నాదల్ చరిత్ర పుటలకెక్కాడు. 
 
పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్ స్లామ్‌లు సాధించిన రెండో ఆటగాడిగా నాదల్ నిలిచాడు. అభిమానులు ముద్దుగా ఫెడెక్స్ అని పిలుచుకునే రోజర్ ఫెదరర్ 18 గ్రాండ్ స్లామ్‌లతో అగ్రస్థానంలో నిలవగా, నాదల్ 15 టైటిళ్లతో ద్వితీయ స్థానంలో నిలిచాడు. పది ఫ్రెంచ్ ఓపెన్ రికార్డు ఫెదరర్ పేరిట కూడా లేకపోవడంతో నాదల్ రికార్డును అంతా "నభూతోః నభవిష్యతిః"గా కీర్తిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

తర్వాతి కథనం
Show comments