Webdunia - Bharat's app for daily news and videos

Install App

సేద్యం నేర్చుకుంటున్న ధోనీ.. ట్రాక్టర్‌ ఎక్కి పొలం దున్నుతూ... (video)

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (14:44 IST)
Dhoni
కరోనా కారణంగా అందరూ ఇంటికే పరిమితం అవుతున్నారు. అలాగే క్రికెటర్లు సైతం ఇంటి పట్టున గడుపుతూ.. తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కరోనా కారణంగా క్రీడలన్నీ వాయిదా పడడంతో ఇన్ని రోజులు ఇళ్లకే పరిమితమైన ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు.  
 
ఇందులో భాగంగా రాంచీలోని తన ఫామ్‌హౌజ్‌కు పరిమితమైన టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ సేంద్రీయ వ్యవసాయం చేయడం నేర్చుకుంటున్నాడు. ట్రాక్టర్‌ ఎక్కి పొలం దున్నుతున్నాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పంచుకోడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది. 
 
కాగా, ధోనీ ఇంతకుముందే ఓ వీడియోలో మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయం చేయడం తనకు ఇష్టమని, అది నేర్చుకుంటున్నానని చెప్పాడు. పుచ్చకాయలు, బొప్పాయిలు ఈ పద్ధతిలో ఎలా సాగుచేయాలో తెలుసుకుంటున్నట్లు తెలిపాడు.
 
ఈ నేపథ్యంలోనే ధోనీ వ్యవసాయ పనులు ప్రారంభించాడు. మరోవైపు గతేడాది నుంచీ టీమిండియాకు దూరమైన మాజీ సారథి ఎప్పుడు మళ్లీ జట్టులోకి వస్తాడనే విషయంపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments