Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిమ్మలను చూసి దేశం గర్విస్తుంది : రోహిత్ సేనకు కపిల్ దేవ్ ప్రశంస

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (09:59 IST)
స్వదేశంలో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఓడిపోయింది. దీంతో భారత క్రికెటర్లలో నిర్వేదం కొలకొంది. దుఃఖ సాగరంలో మునిగిపోయారు. దీంతో ప్రధాన నరేంద్ర మోడీ స్వయంగా క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి భారత క్రికెటర్లను ఓదార్చారు. తాజాగా 1983 ప్రపంచ కప్ హీరో, మాజీ క్రికెట్ లెజెండ్ కపిల్‌ దేవ్ అండగా నిలిచారు. మీరెప్పుడో ఛాంపియన్స్‌గా నిలిచారంటూ కితాబిచ్చారు. తలెత్తుకోండి.. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది. స్ఫూర్తిని కోల్పోవద్దని పిలుపునిచ్చారు. 
 
"చాంపియన్స్‌లా ఆడారు. సగర్వంగా తలెత్తుకోండి" అని ప్రశంసించాడు. మీ మెదళ్ళలో ట్రోఫీ తప్ప మరో ఆలోచన లేకుండా ఆడారని, కాబడ్డి మీరెప్పుడూ విజేతగా నిలిచారని కొనియాడు. జట్టు చూసి దేశం గర్విస్తుందన్నాడు. భవిష్యత్‌లో మరెన్నో విజయాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయని రోహిత్‌ను ఉద్దేశించి పేర్కొన్నాడు.
 
ఇది కష్టకాలమని తెలిసినా స్ఫూర్తిని కోల్పోవద్దని, దేశం మొత్తం నీకు (రోహిత్)గా అండగా ఉందని పేర్కొన్నాడు. కాగా, భారత్ - ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌ డిస్నీ హాట్‌స్టార్స్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ మాధ్యమం ద్వారా ఏకంగా 5.9 కోట్ల మంది మ్యాచ్‌ను వీక్షించారు. దీంతో సెమీఫైనల్ మ్యాచ్ రికార్డు (5.3 కోట్లు) రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. లీగ్ దశలో ఇండియా - కివీస్ మ్యాచ్‌ను 4.3 కోట్ల మంది చూస్తే, భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్‌ను 4.4 కోట్ల మంది వీక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల సమస్యల కోసం మంత్రుల ఉప సంఘం... డ్రగ్స్‌పై యుద్ధం... (Video)

హైదరాబాద్ ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం (వీడియో)

జూలై 22 నుంచి బడ్జెట్ సమావేశాలు... 23న బడ్జెట్ దాఖలు

బడలిక కారణంగా సరిగ్గా చర్చించలేక పోయా : జో బైడెన్

కేసీఆర్ మరో ఎమ్మెల్యే షాక్ : కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

తర్వాతి కథనం
Show comments