Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఇంగ్లండ్ పర్యటన : ఆర్చర్‌కు చోటు.. తొలి రెండు టెస్టులకు జట్టు ఎంపిక

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (11:21 IST)
భారత్‌లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పర్యటించనుంది. శ్రీలంక పర్యటనను ముగించుకుని ఇంగ్లండ్ నేరుగా భారత్‌లో అడుగుపెట్టనుంది. ఈ పర్యటనలో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడనుంది. 
 
ఈ నేపథ్యంలో చెన్నై వేదికగా జరిగే తొలి రెండు టెస్టుల కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. తన ఎక్స్‌ప్రెస్ వేగంతో బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించే జోఫ్రా ఆర్చర్ జట్టులోకి పునరాగమనం చేశాడు.
 
అలాగే, ఆల్ రౌండర్ బెన్‌స్టోక్స్, ఓపెనర్ రోరీ బర్న్ కూడా జట్టులోకి వచ్చారు. బెయిర్ స్టో, శామ్ కరన్, మార్క్‌వుడ్‌లకు టీమిండియాతో తొలి రెండు టెస్టులకు విశ్రాంతినిచ్చారు. ఫిట్నెస్ నిరూపించుకుంటే ఓల్లీ పోప్ ఇంగ్లాండ్ జట్టుతో కలుస్తాడు. ఫిబ్రవరి 5 నుంచి భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. 
 
తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ జట్టు ఇదే...
జో రూట్ (కెప్టెన్), రోరీ బర్న్స్, డామ్ సిబ్లే, జాక్ క్రాలే, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, ఓల్లీ స్టోన్, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, స్టూవర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, డామ్ బెస్, క్రిస్ వోక్స్, జేమ్స్ ఆండర్సన్, జోఫ్రా ఆర్చర్.
 
రిజర్వ్ ఆటగాళ్లు...
జేమ్స్ బ్రేసీ, మాసన్ క్రేన్, సకిబ్ మహమూద్, మాట్ పార్కిన్సన్, ఓల్లీ రాబిన్సన్, అమర్ వర్దీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఘనంగా ఘట్కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 6 వార్షికోత్సవం: ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

తర్వాతి కథనం
Show comments