Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌-ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఇదే.. ఆర్చర్, స్టోక్స్‌కు స్థానం

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (08:58 IST)
భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు గురువారం జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న 4 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు టెస్టుల కోసం జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టుతో పాటు ఆరుగురిని రిజర్వ్‌ ఆటగాళ్లుగా ఎంపిక చేసింది. శ్రీలంక పర్యటనకు విశ్రాంతి ఇచ్చిన ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌, స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ తిరిగి జట్టులోకి వచ్చారు.
 
పెటర్నిటీ లీవ్‌ మీద శ్రీలంక పర్యటనకు దూరమైన రోరీ బర్న్స్‌ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. జానీ బెయిర్‌ స్టో, సామ్‌ కర్రన్‌, మార్క్‌వుడ్‌లకు జట్టులో చోటు దక్కలేదు. ఒల్లీ పోప్‌ ఫిట్‌నెస్‌ సాధించిన అనంతరం జట్టుతో చేరుతాడని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. కరోనా బారిన పడి కోలుకున్న మొయిన్‌ అలీకి కూడా అవకాశం దక్కింది.
 
ఇంగ్లాండ్‌ జట్టు : జో రూట్‌ (కెప్టెన్‌), రోరీ బర్న్స్‌, డామ్‌ సిబ్లీ, జోఫ్రా ఆర్చర్‌, జోస్‌ బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌, మొయిన్‌ అలీ, జాక్‌ క్రావ్లే, ఒల్లీ స్టోన్‌, జేమ్స్‌ అండర్సన్‌, క్రిస్‌ వోక్స్‌, డామ్‌ బెస్‌, డాన్‌ లారెన్స్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జాక్‌ లీచ్‌.
 
రిజర్వు ఆటగాళ్లు : జేమ్స్‌ బ్రాసీ, మాసోన్‌ క్రేన్‌, సకీబ్‌ మహమూద్‌, మాట్‌ పార్కిన్సన్‌, ఒల్లీ రాబిన్సన్‌, అమర్‌ విర్ది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

తర్వాతి కథనం
Show comments