Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇలాంటి సంద‌ర్భాలు మ‌ళ్లీ మ‌ళ్లీ రావు.. ఎంజాయ్ చేయండి : రవిశాస్త్ర

Advertiesment
ఇలాంటి సంద‌ర్భాలు మ‌ళ్లీ మ‌ళ్లీ రావు.. ఎంజాయ్ చేయండి : రవిశాస్త్ర
, బుధవారం, 20 జనవరి 2021 (12:37 IST)
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా, తిరుగేలేని గాబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాకు తిరుగులేని రికార్డు ఉంది. అలాంటి స్టేడియంలో భారత కుర్రోళ్లు విజయఢంకా మోగించారు. దీంతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. 
 
ఈ క్రమంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయ‌ర్స్ ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఈ సంద‌ర్భంగా కోచ్ ర‌విశాస్త్రి ఈ సంచ‌ల‌న విజ‌యానికి కార‌ణ‌మైన ప్లేయ‌ర్స్‌ను ఉద్దేశించి స్ఫూర్తిదాయ‌క ప్ర‌సంగం చేశాడు. గ‌బ్బా కోట‌ను బ‌ద్ధ‌లు కొట్ట‌డంలో కీల‌క‌పాత్ర పోషించిన పుజారా, శుభ్‌మ‌న్ గిల్‌, రిష‌బ్ పంత్‌, శార్దూల్ ఠాకూర్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ల‌ను అత‌ను ఆకాశానికెత్తాడు. 
 
ఇలాంటి సంద‌ర్భాలు మ‌ళ్లీ మ‌ళ్లీ రావ‌ని.. ఈ క్ష‌ణాన్ని పూర్తిగా ఆస్వాదించాల‌ని ప్లేయ‌ర్స్‌కు సూచించాడు. ముఖ్యంగా కెప్టెన్ ర‌హానే టీమ్‌ను ముందుండి న‌డిపించిన తీరును ర‌విశాస్త్రి ప‌దేప‌దే ప్ర‌స్తావించాడు. 
 
ఈ ప్ర‌సంగానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఇందులో ప్లేయ‌ర్స్ అంతా ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఈ స్పీచ్‌కు సంబంధించి మొత్తం వీడియో కోసం కింద ట్వీట్‌లో ఉన్న బీసీసీఐ టీవీ లింక్ క్లిక్ చేయండి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభమన్ గిల్ కొత్త రికార్డు.. అత్యంత పిన్న వయస్సులో అర్థసెంచరీతో..!