Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు చాలా లావుగా కనిపిస్తున్నారు... సంజన గణేశ్‌కు బాడీ షేమింగ్..

ఠాగూర్
మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (13:08 IST)
భారత క్రికెట్ జట్టు పేసర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజన గణేశ్‌కు తీవ్ర అవమానం ఎదురైంది. ఆమె శరీరాకృతిపై విమర్శలు వచ్చాయి. తనను బాడీ షేమింగ్‌కు పాల్పడిన వ్యక్తికి ఆమె సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఆమె వాలెంటైన్స్ డే ప్రమోషనల్ పోస్టుకు ఓ ఇన్‌స్టా యూజర్ బాడీ షేమింగ్ గురించి కామెంట్స్ చేశారు. "భాభీ మోటీ లగ్ రహీ హై(మీరు చాలా లావుగా కనిపిస్తున్నారు) అంటూ కామెట్స్ చేశారు. దీనికి సంజన గణేశ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. 
 
"నీకు స్కూల్ సైన్స్ పాఠ్య పుస్తకాలు కూడా గుర్తున్నట్టు లేదు. మహిళల శరీరంపై కామెంట్ చేస్తావా? ఎంత ధైర్యం? పో.." అంటూ  తీవ్రంగా స్పందించారు. ఆమె రిప్లైకు నెటిజన్లు స్పందిస్తూ అభినందిస్తున్నారు. కాగా గాయం కారణంగా కొంతకాలం పాటు జట్టుకు దూరమైన జస్ప్రీత్ బూమ్రా... వచ్చే గురువారం నుంచి రాజ్‌కోట్ వేదికగా పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. వైజాగ్ టెస్టులో విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా... ఈ మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది వికెట్లు తీసిన విషయం తెల్సిందే. తనకు ఖాళీ సమయం దొరికినపుడల్లా ఆయన తన కుటుంబ సభ్యులతో గడుపుంటారు. కాగా, బుమ్రా - సంజల దంపతులకు పండంటి బిడ్డ జన్మించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

తర్వాతి కథనం
Show comments