Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బరువెక్కిన సంజన.. నెటిజన్‌కు షాకిచ్చిన బుమ్రా భార్య

Advertiesment
Bumrah_Sanjana

సెల్వి

, మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (10:48 IST)
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, సంజన గణేశన్‌‌లు ప్రేమించి వివాహం చేసుకున్నారు. స్టార్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ అయిన సంజన గణేషన్.. టీమిండియా స్టార్ ప్లేయర్ అయిన బుమ్రాల పరిచయం కాస్త ప్రేమగా మారి 2021 మార్చి 15న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 
 
గతేడాది సెప్టెంబర్ 4న వీరికి ఓ బాబు జన్మించాడు. అతనికి అంగద్ జస్‌ప్రీత్ బుమ్రా‌గా పేరు పెట్టారు. ప్రస్తుతం బుమ్రా.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ ఆడుతున్నాడు. తొలి రెండు టెస్ట్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. హైదరాబాద్ టెస్ట్‌లో 6, వైజాగ్ టెస్ట్‌లో 9 వికెట్లు పడగొట్టాడు. 
 
తాజాగా జస్‌ప్రీత్ బుమ్రా సోషల్ మీడియా వేదికగా సోమవారం ఓ ప్రమోషనల్ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో బుమ్రాతో పాటు సంజన గణేశన్ సైతం కనిపించారు. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె కాస్త బరువెక్కారు.
 
దాంతో ఓ నెటిజన్ 'బాబీ బరువెక్కారు' అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు చిర్రెత్తుకుపోయిన సంజన గణేశన్.. సదరు నెటిజన్‌కు క్లాస్ పీకారు. మరోసారి ఇలా ఆకతాయి కామెంట్స్ చేయకుండా గట్టిగా బుద్ది చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిడుగుపాటుకు గురైన ఫుట్‌బాల్ క్రీడాకారుడు.. తర్వాత ఏమైందంటే?