Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుంచి ఐపీఎల్ టోర్నీ టిక్కెట్ల విక్రయం

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (20:56 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ పోటీల నిర్వహణ కరోనా వైరస్ కారణంగా అర్థాంతరంగా ఆగిపోయాయి. ఈ పోటీలను ఇపుడు యూఏఈ వేదికగా నిర్వహించేలా ప్లాన్ చేశారు. మరో నాలుగు రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 14వ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లకు గురువారం నుంచి టికెట్లు అందుబాటులోకి తీసుకునిరానున్నారు. 
 
ఈ టిక్కెట్లను ఐపీఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ www.iplt20.com నుంచి వాటిని కొనుగోలు చేసుకోవచ్చని టోర్నీ నిర్వహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. కొవిడ్‌-19 నిబంధనలను దృష్టిలో పెట్టుకొని పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు చెప్పారు. 
 
ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఈ ఏ ఏడాది ఏప్రిల్‌లో తొలుత భారత్‌లో నిర్వహించగా బయోబుడగలోని పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడ్డారు. దీంతో మే 4న టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్వహకులు ఆ రోజు ప్రకటించారు. 
 
ఈ క్రమంలోనే సెప్టెంబర్‌ 19 నుంచి మళ్లీ ఈ టోర్నీని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో అన్ని ఫ్రాంఛైజీలు ఇప్పటికే యూఏఈకి చేరుకొని ప్రాక్టీస్‌ కూడా మొదలెట్టాయి. యూఏఈ నిబంధనలకు అనుగుణంగా ఈ మ్యాచ్‌లకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తున్నామని నిర్వహకులు ఒక ప్రకటనలో చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

తర్వాతి కథనం
Show comments