Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్

Webdunia
ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (17:32 IST)
రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చిన అజింక్యా రహానేను తప్పించి స్టీవ్ స్మిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
 
శనివారం ముంబైతో మ్యాచ్‌కు గంట ముందు రహానే స్థానంలో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు జట్టు పగ్గాలప్పగిస్తున్నట్టు మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని జట్టు మేనేజ్‌మెంట్ కేవలం కొన్ని గంటల వ్యవధిలో తీసుకుంది. స్టీవ్ స్మిత్ వచ్చే నెల ఒకటో తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. 
 
బాల్‌ టాంపరింగ్‌ స్కామ్‌లో ఒక యేడాది పాటు నిషేధాన్ని ఎదుర్కొన్న స్మిత్‌.. గతంలోనూ రాజస్థాన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఐపీఎల్‌లో రహానే కెప్టెన్సీ ఆడిన 8 మ్యాచ్‌ల్లో రాయల్స్‌ రెండు మాత్రమే నెగ్గింది. ఇక, మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో కనీసం ఐదు నెగ్గితేనే వారి ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తనపై అఘాయిత్యం చేస్తున్న ఉపాధ్యాయుడిని Live video తీసిన విద్యార్థిని

గత 30 ఏళ్లలో తొలిసారిగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం

యూపీలో ఘోరం- రక్షాబంధన్ రోజే 14 ఏళ్ల చెల్లిపై అత్యాచారం.. ఆపై హత్య

Tirupati: శ్రీవారికి వైజయంతి రాళ్లతో పొదిగిన బంగారు లక్ష్మీ లాకెట్టు

గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో భారీ వర్షం- 52 మి.మీ.వరకు వర్షపాతం నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

తర్వాతి కథనం
Show comments