Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ ఆటగాళ్ల వేలం : వేలానికి పేరు నమోదు చేసుకున్న బెంగాల్ మంత్రి

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (07:58 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త సీజన్ కోసం ఆటగాళ్ల వేలం పాటలు ఈ నెలలో ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకు చేరుకుని జట్టు కోసం కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. అయితే, ఈ ఆటగాళ్ళ వేలం పాటల కోసం వెస్ట్ బెంగాల్ క్రీడల మంత్రి మనోజ్ తివారీ తన పేరును నమోదు చేసుకున్నారు. ఈయన ప్రారంభ ధర రూ.50 లక్షలుగా పేర్కొన్నారు. 
 
మనోజ్ తివారీ బెంగాల్ క్రికెటర్. గతంలో భారత క్రికెట్ జట్టు తరపున పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 12 వన్డేలు, 3 ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడాడు. అలాగే, ఐపీఎల్ టోర్నీల్లో ఇప్పటి వరకు కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రైజింగూ పూణె సూపర్ జెయింట్ వంటి జట్లకు ప్రాతినిథ్యం వహించారు. 
 
ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో శిభ్‌ పూర్ స్థానం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం తన మంత్రివర్గంలో క్రీడల శాఖామంత్రిగా మనోజ్ తివారీని సీఎం మమతా బెనర్జీ నియమించారు. 
 
అయితే, మనోజ్ తివారీ చివరగా గత 2018లో ఐపీఎల్ టోర్నీలో పాల్గొన్నాడు. ఈ సారి ఐపీఎల్ టోర్నీలో పాల్గొనాలని ఫిక్స్ అయిన మనోజ్ తివారీ, తన ప్రారంభధర రూ.50 లక్షలుగా ప్రకటించారు. ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్న తివారీని ఓ ఫ్రాంచేజీ కొనుగోలు చేస్తుందో వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

తర్వాతి కథనం
Show comments