ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన రాయల్ ఛాలెంజర్స్ - పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్

ఠాగూర్
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (11:24 IST)
ఐపీఎల్ సీజన్‌లో భాగంగా, ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు విజయభేరీ మోగించింది. ఆ జట్టు చేతిలో కలిగిన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. డీసీ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.3 ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి ఛేదించింది. 
 
కృనాల్ పాండ్యా అల్‌రౌండ్ మెరుపులకు తోడు విరాట్ కోహ్లీ మరో హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక మోస్తరు ఛేదనతో బరిలోకి దిగిన బెంగుళూరుకు ప్రారంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. 4 ఓవర్ల ముగిసేసరికి బెంగుళూరు 3 వికెట్ల కోల్పోయి కేవలం 26 రన్స్ మాత్రమే చేసింది. 
 
డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్.. ఒకే ఓవరులో బెతెల్(12)తో పాటు పడిక్కల్ (0)ను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత కరుణ్ మెరుపు త్రో తో ఆర్సీబీ సారథి రజిత్ పాటీదార్ (6) రనౌట్ అయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా.. కోహ్లీతో కలిసి బెంగుళూరు ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా, కోహ్లీతో కలిసి బెంగుళూరు ఇన్నింగ్స్ చక్కదిద్దారు. డీసీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో 12 ఓవర్లలోనూ ఆర్సీబీ స్కోరు 78/3గానే ఉంది. 
 
కానీ, ముకేశ్ 13వ ఓవర్ నుంచి కృనాల్ గేర్ మార్చాడు. ఓ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన అతడు కుల్దీప్ ఓవర్‌లోనూ ఓ సిక్స్ బాదాడు. అక్షర్ బౌలింగ్‌లో బౌండరీతో కృనాల్ అర్థ శతకం పూర్తయింది. కోహ్లీ కూడా వరుసగా మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే, బెంగుళూరు విజయానికి 18 పరుగుల దూరంలో కోహ్లీ నిష్క్రమించినా కృనాల్, డేవిడ్ (19 నాటౌట) లాంఛనాన్ని పూర్తి చేశాడు. 
 
ఈ విజయంతో బెంగుళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో ఏడు విజయాలతో ఆర్సీబీ అగ్రస్థానానికి ఎగబాకింది. మరోవైపు, గుజరాత్, ముంబై, ఢిల్లీ, పంజాబ్ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఐపీఎల్ 2025లో ప్రత్యర్థి వేదికల్లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఆర్బీసీ సొంతం చేసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిర్మలమ్మ పద్దు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింభం : ప్రధాని మోడీ

నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు

కేంద్ర బడ్జెట్ 2026-27 : ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమలు

కేంద్ర బడ్జెట్ 2026-27 : దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి

రికార్డు స్థాయిలో లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

తర్వాతి కథనం
Show comments