Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sunrisers Hyderabad: చెన్నై సూపర్ కింగ్స్‌పై ఐదు వికెట్ల తేడాతో SRH గెలుపు

Advertiesment
SRH_Dhoni

సెల్వి

, శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (23:23 IST)
SRH_Dhoni
ఐపీఎల్ 2025లో భాగంగా ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన ఇచ్చారు. శుక్రవారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 154 పరుగులకే పరిమితం చేశారు. తదనంతరం స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా చేధించిన హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. ఇంకా 8 బంతులు మిగిలి వున్నా లక్ష్యాన్ని ఈజీగా చేధించింది. 
 
సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 
హర్షల్ పటేల్ 4 వికెట్లు పడగొట్టగా, కెప్టెన్ పాట్ కమ్మిన్స్, జయదేవ్ ఉనద్కత్ 2 వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ షమీ, కమిందు మెండిస్ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. 
 
సన్‌రైజర్స్ బౌలింగ్ ప్రతిభకు అద్భుతమైన ఫీల్డింగ్ తోడ్పడింది. దీని ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ 19.5 ఓవర్లలో ఆలౌట్ అయింది. 
 
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్లలో, యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 1 ఫోర్, 4 సిక్సర్లు ఉన్నాయి. బ్రెవిస్ ఊపందుకుంటున్నట్లు కనిపించినా, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కమిందు మెండిస్ బౌండరీ లైన్ దగ్గర అద్భుతమైన డైవింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 
 
ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్, తెలుగు యువ ఆటగాడు షేక్ రషీద్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మొహమ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. తోటి ఓపెనర్ ఆయుష్ మాత్రే 30 పరుగులు, ఆ తర్వాత సామ్ కుర్రాన్ (9), రవీంద్ర జడేజా (21), శివం దుబే (12) పరుగులు సాధించారు. చివరిలో, దీపక్ హుడా దూకుడుగా 22 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరును 150 పరుగుల మార్కును దాటడంలో సహాయపడ్డాడు.
 
కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 10 బంతుల్లో 6 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. పేస్ మార్పు ద్వారా పెద్ద షాట్ కొట్టడానికి ప్రయత్నించి, పాయింట్ వద్ద అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. ఫలితంగా స్వల్ప స్కోరుకే చెన్నై ఆలౌటైంది. తదనంతరం స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు అద్భుత ఇన్నింగ్స్ ఆడింది.
 
హైదరాబాద్ ఆటగాళ్లలో అభిషేక్ శర్మ (0) పరుగులేమీ చేయలేదు. ట్రావిస్ హెడ్ (19), ఇషాన్ కిషన్ (44), హెన్రిచ్ (7), అనికెత్ వర్మ (10) జట్టుకు పరుగులు సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. కమిండు మెండిస్ మ్యాచ్ చివరి వరకు 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 
 
అలాగే నితిష్ కుమార్ రెడ్డి 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో 18.4 ఓవర్లలోనే హైదరాబాద్ ఐదు వికెట్ల నష్టానికి 155 పరుగులతో గెలుపును సాధించింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, జడేజా తలా ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

MS Dhoni: కోహ్లీ, రోహిత్ శర్మ బాటలో మహీ-400వ T20 ఆడనున్న కూల్ కెప్టెన్