శుక్రవారం చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) లెజెండ్ ఎంఎస్ ధోని తన కెరీర్‌లో 400వ T20 ఆడనున్నారు. ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలతో అట్టడుగున ఉన్న ధోని నేతృత్వంలోని సీఎస్కే, ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు ఓటములతో సమానంగా తొమ్మిదో స్థానంలో ఉన్న SRHతో శుక్రవారం చేపాక్ స్టేడియంలో తలపడనుంది. ఓడిపోయిన జట్టు తట్టాబుట్టా సర్దుకోవాల్సి వుంటుంది. ఇంకా ఎలిమినేషన్ ప్రమాదం పెరుగుతుంది.
ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అడుగు జాడల్లో నడవబోతున్నాడు. ఫలితంగా భారీ మైలురాయిని పూర్తి చేయబోతున్నాడు. ఎంఎస్ ధోని T20 క్రికెట్‌లో పెద్ద ఘనత సాధించిన నాల్గవ భారతీయుడిగా అవతరించాడు.
విరాట్ కోహ్లీ (407), దినేష్ కార్తీక్ (412), రోహిత్ శర్మ తర్వాత టీ20 క్రికెట్‌లో క్వాడ్రపుల్ సెంచరీలు పూర్తి చేసిన 24వ ఆటగాడిగా, నాల్గవ భారతీయుడిగా ధోనీ నిలిచాడు.
ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్, జార్ఖండ్‌లోని తన దేశీయ జట్టు తరపున 399 మ్యాచ్‌ల్లో, ధోని 38.02 సగటుతో 7,566 పరుగులు చేశాడు. ఇందులో 28 అర్ధ సెంచరీలు. 84* అత్యుత్తమ స్కోరు ఉంది.