Webdunia - Bharat's app for daily news and videos

Install App

కింగ్ కోహ్లీ అద్భుత రికార్డు.. పంజాబ్‌పై 1000 పరుగులు పూర్తి

సెల్వి
శుక్రవారం, 10 మే 2024 (08:06 IST)
Kohli
పంజాబ్ కింగ్స్‌తో ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 60 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ అద్భుత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆర్‌సీబీ విజ‌యంలో మెరుపు ఇన్నింగ్స్‌తో కింగ్ కోహ్లీ కీల‌క పాత్ర పోషించాడు. 47 బంతుల్లోనే కోహ్లీ 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో ఏకంగా 92 పరుగులు సాధించాడు. 
 
దీంతో ఈ క్ర‌మంలో పంజాబ్‌పై విరాట్ 1000 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్ప‌టికే ఈ ఫీట్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్‌ల‌పై న‌మోదు చేసిన కోహ్లీ ఐపీఎల్ చ‌రిత్ర‌లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా మూడు ఐపీఎల్ జ‌ట్ల‌పై 1000 ప‌రుగుల మార్క్ అందుకున్న‌ తొలి బ్యాట‌ర్‌గా కోహ్లీ నిలిచాడు. 
 
అలాగే ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో విరాట్ కోహ్లీ ఇప్ప‌టివ‌ర‌కు 12 మ్యాచులాడాడు. ర‌న్ మెషీన్ 70.44 స‌గ‌టు, 153.51 స్ట్రైక్ రేటుతో 634 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఒక శ‌త‌కం, ఐదు అర్ధ శ‌త‌కాలు ఉన్నాయి. మొత్తం 30 సిక్స‌ర్లు, 55 ఫోర్లు కొట్టాడు. ప్ర‌స్తుతం ఆరెంజ్ క్యాప్ త‌న వ‌ద్దే ఉంచుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ కాంబోలో యుఫోరియా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్ షూటింగ్ పూర్తి

ప్రభాస్ లో డెడికేషన్ చూశా, పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

'పుష్ప-2' త్రీడీ వెర్షన్‌ విడుదలకు ముందు చిక్కులు... ఏంటవి?

అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం వేస్తున్నారు? : తెలంగాణ హైకోర్టు ప్రశ్న

తర్వాతి కథనం
Show comments