Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2023 : ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

Webdunia
ఆదివారం, 21 మే 2023 (19:53 IST)
ఐపీఎల్ టోర్నీలో భాగంగా, ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఆదివారం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై జట్టు విజయభేరీ మోగించింది. ప్రత్యర్థి సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ జట్టుతో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 
హైదరాబాద్‌ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సునాయసంగా ఛేదించింది. కామెరూన్‌ గ్రీన్ 47 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్స్‌ల సాయంతో సరిగ్గా వంద పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 
 
అలాగే, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 56 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో రాణించాడు. సూర్యకుమార్‌ యాదవ్ 16 బంతుల్లో 4 ఫోర్లతో సాయంతో 25 (నాటౌట్)గా నిలిచాడు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌, మయాంక్ దగార్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 
 
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 83 పరుగులు చేయగా, వివ్రాంత్ శర్మ 47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69 పరుగులు చేసి రాణించారు. అలాగే, క్లాసెన్ (18) పరుగులు చేయగా..  గ్లెన్‌ ఫిలిప్స్‌ (1), బ్రూక్‌ (0)లను నిరాశపరిచారు. సన్వీర్ సింగ్ (4), మార్‌క్రమ్ (13) నాటౌట్‌గా నిలిచారు. ముంబై బౌలర్లలో ఆకాశ్‌ మధ్వల్ 4, జోర్డాన్‌ ఒక వికెట్ పడగొట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

మనిషి మర్చిపోవడం సహజం.. కానీ ఎవరైతే అన్నం పెట్టారో : డిప్యూ సీఎం పవన్ (Video)

రేపు లోక్‌సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు!!

ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్‌పై మాజీ సీఎం కొడుకు పోటీ!!

గతంలో తెలుగు భాషపై దాడి జరిగింది : మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

తర్వాతి కథనం
Show comments