Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంతగడ్డపై ఢిల్లీని చిత్తు చేసి ప్లే ఆఫ్ రౌండ్‌లోకి చెన్నై కింగ్స్ ఘనవిజయం

Webdunia
శనివారం, 20 మే 2023 (20:12 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్-16వ సీజన్ 67వ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు శనివారం తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. దీని ప్రకారం తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. 
 
ఓపెనింగ్ ప్లేయర్లుగా రంగంలోకి దిగిన శివమ్ దూబే, కాన్వాయ్ దూకుడుగా ఆడారు. ఇద్దరూ అర్ధ సెంచరీలు సాధించారు. తొలి వికెట్‌కు 141 పరుగులు జోడించిన తర్వాత రుతురాజ్ 79 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇతడు 87 పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం 224 పరుగులు చేస్తే గెలుపే లక్ష్యంగా ఢిల్లీ జట్టు రంగంలోకి దిగింది. 
 
చెన్నై జట్టు కచ్చితమైన బౌలింగ్‌కు ఢిల్లీ జట్టు ఉచ్చులో పడింది. 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓ వైపు వికెట్లు పడినా.. కెప్టెన్ డేవిడ్ వార్నర్ బాధ్యతతో ఆడాడు. వార్నర్ 87 పరుగుల వద్ద ఔటయ్యాడు. 
 
చివరికి ఢిల్లీ 146 పరుగులకే ఆలౌటైంది. దీంతో చెన్నై జట్టు 77 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ రౌండ్‌ను ఖాయం చేసుకుంది. చెన్నై జట్టు తరఫున దీపక్ చాహర్ 3 వికెట్లు, పధీరణ, దీక్షన తలో 2 వికెట్లు తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

తర్వాతి కథనం
Show comments