Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ - చిత్తుగా ఓడిన ఢిల్లీ

Webdunia
సోమవారం, 9 మే 2022 (07:42 IST)
ఐపీఎల్ 15వ సీజన్ పోటీల్లో భాగంగా, ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఫలితంగా ప్రత్యర్థి ఢిల్లీ చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసి చెన్నై జట్టు 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ జట్టును 117 పరుగులకే కట్టడి చేయడంతో 91 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ ఓటమితో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లిపోయాయి. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు డెవోన్ కాన్వే మరోమారు చెలరేగాడు. 49 బంతుల్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేయగా రుతురాజ్ గ్వైకాడ్ 41, శివం దూబే 32, ధోనీ 21 చొప్పున పరుగులు చేశారు. దీంతో 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఆ తర్వాత 209 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 117 పరుగులు మాత్రమే చేసింది. 
 
ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ చేసిన 25 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. ఆ తర్వాత వార్నర్ 19, కెప్టెన్ రిషబ్ పంత్ 21, శార్దూల్ ఠాకూర్ 24 చొప్పున పరుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్లు పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. ఫలితంగా దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఈ టోర్నీలో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

తర్వాతి కథనం
Show comments