Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌ 14వ సీజన్‌.. చెన్నై పేరిట ఘనమైన రికార్డ్.. మిగిలిన జట్ల సంగతేంటి?

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (12:21 IST)
ఐపీఎల్‌ 14వ సీజన్‌ తుది అంకానికి చేరింది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ ఈసారి త్రుటిలో ప్లేఆఫ్స్‌ అవకాశాలను చేజార్చుకొంది. దీంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేరిట ఉన్న ఓ ఘనమైన రికార్డును ఆ జట్టు చేరుకోలేక చతికిలపడింది. వరుసగా మూడోసారి ఫైనల్స్‌ చేరే అవకాశాన్ని ముంబయి కోల్పోయింది. గత రెండు సీజన్లలో ఛాంపియన్స్‌గా అవతరించిన రోహిత్‌ జట్టు.. ఈసారి 14 పాయింట్లతో కోల్‌కతాతో సమానంగా నిలిచింది. 
 
కానీ, రన్‌రేట్‌ పరంగా కాస్త వెనుకంజలో ఉండటంతో ప్లేఆఫ్స్‌కు వెళ్లలేకపోయింది. ఇక చెన్నై గతంలో వరుసగా మూడేళ్లు ఫైనల్స్‌ చేరి రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. 2010, 2011లో ఛాంపియన్స్‌గా నిలిచిన ధోనీసేన తర్వాత రెండేళ్లు రన్నరప్‌గా నిలిచింది. చెన్నై తర్వాత ముంబయి ఆ రికార్డును చేరుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన దిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. 
 
మరోవైపు దిల్లీ క్యాపిటల్స్‌ అరుదైన రికార్డును కోల్పోయింది. ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో 20 పాయింట్ల కన్నా ఎక్కువ సాధించే అవకాశాన్ని కోల్పోయింది. 2014లో పంజాబ్‌ 22 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్‌ చేరగా దిల్లీ ఈసారి ఆ రికార్డును చేరుకునేలా కనిపించింది. కానీ, చివరి మ్యాచ్‌లో బెంగళూరుతో ఓటమిపాలై కొత్త రికార్డును అందుకోలేకపోయింది.
 
2016లో తొలిసారి ఛాంపియన్స్‌గా అవతరించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు అత్యంత నిలకడైన జట్టుగా గతంలో పేరు ఉండేది. వరుసగా ఐదేళ్లు ప్లేఆఫ్స్‌ చేరి కొత్త రికార్డు నెలకొల్పింది. అయితే, అంతమంచి పేరున్న హైదరాబాద్‌ ఈసారి మరీ ఘోరంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలే సాధించి ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శనతో ఆఖరి స్థానంలో నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మ మీద ఏదో పోశారు.. చెంప మీద కొట్టారు... ఆపై లైటర్‌తో నిప్పంటించారు..

'సురవరం'కు సీఎం చంద్రబాబు నివాళులు - పోరాట వారసత్వం ఇచ్చి వెళ్లారు...

గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసిన కిరాతక భర్త

రైలులో నిద్రిస్తున్న మహిళను అసభ్యంగా తాకిన కానిస్టేబుల్

బాలికను ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రపరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయం : సీఎం రేవంత్ రెడ్డి

పవన్ కళ్యాణ్ "ఓజీ" నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ ఎపుడో తెలుసా?

మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు : విమర్శకులకు జాన్వీ కౌంటర్

ఐదు పదుల వయసులో శిల్పాశెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

తర్వాతి కథనం
Show comments