Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2018 : చెన్నైకు చుక్కలు చూపిన నైట్ రైడర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 పోటీల్లో భాగంగా గురువారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చుక్కలు చూపించింది. ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం పోటీ పెరుగుతున్న సమయం

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (10:43 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 పోటీల్లో భాగంగా గురువారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చుక్కలు చూపించింది. ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం పోటీ పెరుగుతున్న సమయంలో చక్కని ప్రదర్శన చేసింది. యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌, సునీల్‌ నరైన్‌, దినేశ్‌ కార్తీక్‌ మెరిసిన వేళ.. బలమైన చెన్నైని ఓడించింది. కోల్‌కతాకు ఇది ఐదో విజయంకాగా, చెన్నైకు ఇది మూడో  పరాజయాన్ని చవిచూసింది. ధోనీ మెరుపు ఇన్నింగ్స్‌ వృథా అయింది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. జట్టులో కెప్టెన్‌ ధోనీ నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో 43 (నాటౌట్‌) పరుగులు చేయగా, వాట్సన్‌ 2 సిక్స్‌లు, 4 ఫోర్లతో 36 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా చెన్నై 5 వికెట్లకు 177 పరుగులు సాధించింది. ప్రత్యర్థి బౌలర్లలో నరైన్‌ (2/20), కుల్‌దీప్‌ (1/34), చాల్వాల (2/35) చెన్నైని కట్టడి చేశారు. 
 
ఆ తర్వాత 178 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టు బ్యాట్స్‌మెన్ నరైన్‌ 2 సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 32, మెరుపు ఆరంభాన్నిస్తే.. కార్తీక్‌ 7 ఫోర్లు, ఓ సిక్స్‌ కొట్టి 45 (నాటౌట్) కళ్లు చెదిరే ముగింపునిచ్చాడు. అలాగే, శుభమన్‌ గిల్‌ 2 సిక్స్‌లు, 6 ఫోర్ల సాయంతో 57 (నాటౌట్‌) ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలవడంతో మ్యాచ్ కోల్‌కతా సొంతమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ఆఫర్ చేసింది : డోనాల్డ్ ట్రంప్

India: వైజాగ్‌లో దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన.. స్కైవాక్ టైటానిక్ వ్యూ పాయింట్‌

Pawan Kalyan పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

తర్వాతి కథనం
Show comments