Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నువ్వా… నేనా' : నేడు ఐపీఎల్ ఫైనల్‌లో తలపడనున్న చెన్నై - హైదరాబాద్

ఐపీఎల్ విజేత ఎవరో ఆదివారం తెలిసిపోనుంది. సీజన్-11లో ట్రోఫీ కోసం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆదివారం అంతిమపోరు జరుగనుంది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఫ్యాన్స

Webdunia
ఆదివారం, 27 మే 2018 (11:14 IST)
ఐపీఎల్ విజేత ఎవరో ఆదివారం తెలిసిపోనుంది.  సీజన్-11లో ట్రోఫీ కోసం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆదివారం అంతిమపోరు జరుగనుంది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ చెన్నై స్ట్రాంగ్‌గా ఉంది. సన్‌రైజర్స్ మాత్రం బౌలింగ్ మీదే ఆధారపడి ఉంది. ఎన్నో అనుమానాలు, క్లిష్ట పరిస్థితుల్లో లీగ్‌కి ఎంట్రీ ఇచ్చిన రెండు జట్లు… టాప్-2లో నిలిస్తూ ఫైనల్స్‌కి చేరాయి.
 
మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్ చేసినా, బౌలింగ్ లైనప్‌తో రాణిస్తూ సన్ రైజర్స్ ఫైనల్‌కి చేరితే... ఎంతటి భారీ లక్ష్యాన్నైనా ఈజీగా చేధిస్తూ వచ్చింది చెన్నై సూపర్‌కింగ్స్. స్టార్ ప్లేయర్స్, పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ లేకున్నా.. బౌలింగ్‌తోనే ఫైనల్స్‌కి చేరింది సన్‌రైజర్స్. లీగ్‌లో మిగతా జట్లు ప్లేఆఫ్‌కు చేరేందుకే కష్టాలు పడుతుంటే.. చివరి మూడు లీగ్ మ్యాచ్‌ల్లో ఓడినా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 
 
సన్ రైజర్స్ ఫైనల్స్‌కి చేర్చడంలో కెప్టెన్ విలియమ్సన్‌తో పాటు బౌలింగ్‌లో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న రషీద్ ఖాన్, భువనేశ్వర్, సిద్ధార్త్ కౌల్, షకీబ్ హసన్ కూడా కీరోల్ ప్లే చేశారు. సన్ రైజర్స్‌కి బ్యాటింగ్ కంటే జట్టు బౌలింగ్ పెద్దబలం. అయితే అన్ని ఫార్మాట్లలో రాణిస్తేనే చెన్నైలాంటి ప్రత్యర్థిని క్రికెట్ ఎనలిస్టులు ఓడించొచ్చంటున్నారు. 
 
ఇక బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ పటిష్టంగా ఉంది చెన్నై సూపర్ కింగ్స్. ఓపెనర్లు వాట్సన్, అంబటి రాయుడు తిరుగులేని ఫామ్‌లో ఉండగా సురేష్ రైనా రాణిస్తుడం చెన్నైకి ప్లస్ పాయింట్. బిల్లింగ్స్, ధోనీ, బ్రేవోలతో మిడిలార్డర్ స్ట్రాంగ్ గా ఉంది. ఇక జడేజా, హర్బజన్ సింగ్‌ల స్పిన్, చహర్, శార్దుల్ ఠాకూర్, ఇన్‌గిడిల పేస్‌ను సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్లు ఎలా అడ్డుకుంటారన్నది ముఖ్యం.
 
ఈ సీజన్‌లో చెన్నై, హైదరాబాద్ జట్లు.. మూడుసార్లు తలపడ్డాయి. మూడు మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్సే విజయం సాధించింది. లీగ్ దశలో రెండు సార్లు గెలిచిన చెన్నై… ఫస్ట్ క్వాలిఫయర్‌లో కూడా హైదరాబాద్ మీదనే గెలిచి ఫైనల్‌కు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాకు జయమంగళ రాజీనామా.. పెద్దకర్మ పోస్ట్.. బాబుకు పవన్ గౌరవం ఇస్తారా?

వైసిపికి మరో షాక్, ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా

వాయనాడ్‌‌లో ప్రియాంక గాంధీ ఘనవిజయం.. రాహుల్ రికార్డ్ బ్రేక్

'మహాయుతి' అదుర్స్.. మోదీ, అమిత్ షా, చంద్రబాబు అభినందనలు

మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం వెనుక 5 కీలక కారణాలు, ఏంటవి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

జానీ మాస్టర్‌కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

తర్వాతి కథనం
Show comments