ధోనీ షాకింగ్ కామెంట్స్: ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో వున్నా

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ కావాలనుకుంటున్నాడా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. 36వ సంవత్సరంలోనూ ఉత్సాహంగా క్రికెట్ ఆడుతూ.. తన సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స

మంగళవారం, 22 మే 2018 (10:21 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ కావాలనుకుంటున్నాడా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. 36వ సంవత్సరంలోనూ ఉత్సాహంగా క్రికెట్ ఆడుతూ.. తన సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును విజయవంతంగా ప్లే ఆఫ్ దశకు చేర్చి.. టైటిల్ సాధించే సత్తా ఉన్న జట్లలో చెన్నై ఒకటని నిరూపించాడు.
 
సుదీర్ఘకాలం పాటు క్రికెట్ ఆడిన ధోనీ ఇప్పటికే టెస్టులు, వన్డే క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తాను ఐపీఎల్ క్రికెట్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో వున్నట్లు ధోనీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 
 
చెన్నై జట్టులోని ఎంతోమంది సీనియర్ ఆటగాళ్లు వచ్చే రెండు సంవత్సరాల్లో క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించనున్నారని తెలిపాడు. గత పదేళ్ల ఐపీఎల్ ప్రయాణం మధురానుభూతులను మిగిల్చిందనే భావిస్తున్నానని ధోనీ చెప్పాడు. చెన్నై జట్టు యాజమాన్యం ఎంతో తెలివైనదని, వారు ఆటగాళ్ల మనసులకు దగ్గరయ్యారని చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఐపీఎల్ 2018 : నేడు తొలి క్వాలిఫయర్ మ్యాచ్.. చెన్నై - హైదరాబాద్ ఢీ