Webdunia - Bharat's app for daily news and videos

Install App

విండీస్‌తో తొలి టెస్టు.. ఆ ముగ్గురి సెంచరీలతో.. భారత్ తొలి ఇన్నింగ్స్ 649/9 వద్ద డిక్లేర్

విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా అదరగొట్టింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 649/9 వద్ద డిక్లేర్ చేసింది. రెండో రోజు లంచ్ బ్రేక్ తర్వాత కెప్టెన్ కోహ్లీ భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (17:58 IST)
విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా అదరగొట్టింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 649/9 వద్ద డిక్లేర్ చేసింది. రెండో రోజు లంచ్ బ్రేక్ తర్వాత కెప్టెన్ కోహ్లీ భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు మొత్తం మూడు సెంచరీలు, రెండు భారీ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఫలితంగా నాలుగు వికెట్ల నష్టానికి 364 పరుగులతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ తమ జోరు కొనసాగించారు. రిషభ్ పంత్ 57 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 
 
ఆ తర్వాత.. కోహ్లీ కూడా 184 బాల్స్‌లో ఏడు ఫోర్లతో సెంచరీ పూర్తిచేశాడు. ఈ సెంచరీ కోహ్లీ కెరీర్‌లో 24వ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌తోనే టెస్టుల్లో ఈ ఏడాది వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఘనత సాధించాడు. వేగంగా ఆడిన రిషబ్ పంత్.. నాలుగు సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 84 బాల్స్‌లోనే 92 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తన స్వభావానికి విరుద్ధంగా స్లోగా ఆడిన కోహ్లీ 230 బంతుల్లో 139 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా, టెయిలెండర్ల సాయంతో, భారీ షాట్లతో స్కోరును పరిగెత్తించాడు. 
 
ఆరు వందల మార్కు దాటించాడు. వడివడిగా సెంచరీ దిశగా కదిలాడు. ఒకరి తర్వాత ఒకరి అవుట్ కావడంతో జడేజా సెంచరీ చేస్తాడా లేదా అనే అనుమానం కలిగింది. అశ్విన్ (7), కుల్దీప్ (12), ఉమేష్ యాదవ్(22), షమీ(2 నాటౌట్)ల సాయంతో జడేజా ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో శతక్కొట్టాడు. ఆ వెంటనే 649/9 స్కోరు దగ్గర ఇన్నింగ్స్‌ను కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన యంగ్ క్రికెటర్ పృథ్వీ షా… మొదటిరోజు చెలరేగి ఆడి 134 రన్స్ చేసి పలు రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments