Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌కు ఓటమి.. క్రిస్‌ లిన్‌ ఫిఫ్టీ... మరో కీలక మ్యాచ్‌?

ఐపీఎల్‌లో హైదరాబాద్ మరో ఓటమిని చవిచూసింది. సన్‌రైజర్స్‌పై కోల్‌కతా ఆధిపత్యం చాటుకుంది. ప్లే ఆఫ్స్‌ రేసులో కీలక మ్యాచ్‌లో సన ‌రైజర్స్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్ట

Advertiesment
IPL Live Score
, ఆదివారం, 20 మే 2018 (17:42 IST)
ఐపీఎల్‌లో హైదరాబాద్ మరో ఓటమిని చవిచూసింది. సన్‌రైజర్స్‌పై కోల్‌కతా ఆధిపత్యం చాటుకుంది. ప్లే ఆఫ్స్‌ రేసులో కీలక మ్యాచ్‌లో సన ‌రైజర్స్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌, చెన్నై తర్వాత ప్లే ఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా కోల్‌కతా నిలిచింది. ఇక ఐపీఎల్‌ 11వ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచిన హైదరాబాద్‌ లీగ్‌ దశను ఓటమితో ముగించింది.
 
ఇక లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ (55 పరుగులు, 43 బంతుల్లో), రాబిన్‌ ఉతప్ప (34 బంతుల్లో 45 పరుగులు సాధించారు. దీంతో మరో 2 బంతులుండగానే కోల్‌కతా విజయం సాధించింది. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (26), సునీల్‌ నరైన్‌ (29) రాణించారు. 
 
అంతకముందు టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ సొంతగడ్డపై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (50, 39బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. వికెట్‌ కీపర్‌ గోస్వామి (35), కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (17 బంతుల్లో 36 పరుగులు) రాణించారు.
 
అలాగే ఢిల్లీ డేర్ డెవిల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మరో కీలక మ్యాచ్‌కు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వికెట్‌పై గడ్డి లేదు కాబట్టే బ్యాటింగ్ ఎంచుకున్నట్టు అయ్యర్ తెలిపాడు. 
 
ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. వీలైనంత తక్కువ స్కోరుకే ప్రత్యర్థులను కట్టడి చేస్తామన్నాడు. మెక్‌క్లెనాఘన్ స్థానంలో ముస్తాఫిజుర్‌ను తీసుకున్నట్టు పేర్కొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ బాలీవుడ్ నటి.. నా మనుసును కకావికలం చేసింది : వెస్టిండీస్ క్రికెటర్