Webdunia - Bharat's app for daily news and videos

Install App

#కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్- రెండో వన్డేలో విండీస్‌కు మైదానంలో చుక్కలు

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (11:46 IST)
వెస్డిండీస్‌తో విశాఖలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో ఓపెనర్ల ధాటికి 387 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన విండీస్ 43.3 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ మ్యాచ్‌లో కులదీప్ యాదవ్ చెలరేగిపోయాడు. హ్యాట్రిక్ వికెట్లు తీసి… రెండు సార్లు వన్డేల్లో హ్యాట్రిక్ వికెట్ తీసిన ఏకైక భారత బౌలర్‌గా నిలిచాడు. 33వ ఓవర్ నాలుగో బంతికి హోప్‌ని అవుట్ చేసిన యాదవ్ తర్వాతి బంతికే హోల్డర్‌ని బోల్తా కొట్టించాడు.
 
ఆఖరి బంతికి… జోసేప్గ్‌ని పెవేలియన్ చేర్చాడు.. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ పోరాడినా ఫలితం లేకపోయింది. అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో… విండీస్ ఓటమి లాంచనం అయింది.

43.3 ఓవర్లలో 280 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత బౌలర్లలో కులదీప్, శమీ తలో మూడు వికెట్లు తీయగా… జడేజా రెండు, ఠాకూర్ ఒక వికెట్ తీసారు. 159 పరుగులతో సత్తా చాటిన ఓపెనర్ రోహిత్ శర్మకు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే కటక్‌లో ఆదివారం జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

తర్వాతి కథనం
Show comments