Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాగర తీరంలో దంచుకొట్టుడు... టీమిండియా పరుగుల వరద - విండీస్ చిత్తు

సాగర తీరంలో దంచుకొట్టుడు... టీమిండియా పరుగుల వరద - విండీస్ చిత్తు
, గురువారం, 19 డిశెంబరు 2019 (11:22 IST)
విశాఖపట్టణం సాగర తీరంలో భారత ఆటగాళ్లు దంచుకొట్టారు. స్వదేశంలో పర్యాటక వెస్టిండీస్ జట్టుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది. ఇందులోభాగంగా బుధవారం విశాఖపట్టణంలో రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఇందులో భారత ఆటగాళ్లు రెచ్చిపోయారు. చెన్నై వేదికగా జరిగిన తొలి వన్డేలో ఓడిపోయిన కసితో టీమిండియా ఆటగాళ్లు జూలు విదిల్చారు. ఫలితంగా విశాఖ వన్డేలో భారత్ విజయకేతనం ఎగురవేసి వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 
 
అత్యంత కీలకమైన ఈ వన్డేలో భారత ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. ఇందులో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ 138 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు 159, లోకేశ్‌ రాహుల్‌ 104 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 102 చొప్పున పరుగులు చేయడంతో కోహ్లీ సేన నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 387 పరుగులు చేసింది. 
 
అలాగే, మిడిలార్డర్‌లో యువ ద్వయం శ్రేయాస్‌ అయ్యర్‌ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53, రిషబ్ పంత్‌ 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 39 చొప్పున ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సాగర తీరంలో పరుగుల సునామీ వచ్చినైట్లెంది. 
 
అనంతరం లక్ష్యఛేదనలో హ్యాట్రిక్‌ హీరో కుల్దీప్‌ యాదవ్‌ (3/52), షమీ (3/39) ధాటికి విండీస్‌ 43.3 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. హోప్‌ (85 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి నిలకడ ప్రదర్శించగా.. పూరన్‌ (47 బంతుల్లో 75; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) అదరగొట్టాడు. వీరిద్దరు మినహా మిగిలినవారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. రోహిత్‌ శర్మకు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం కటక్‌లో జరుగనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెస్టిండీస్‌ రెండో వన్డే: గెలుపే లక్ష్యంగా అదరగొడుతున్న భారత్