Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొహాలీ టెస్టులో భారత్ విజయభేరీ - సిరీస్‌లో 1-0 ఆధిక్యం

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (17:34 IST)
పంజాబ్‌లోని మొహాలీ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి టెస్టులో భారత క్రికెట్ జట్టు ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత్ తరపున రవీంద్ర జడేజా బ్యాట్‌తో పాటు బౌల్‌తో మెరిశాడు.
 
ఆల్‌రౌండర్ 175 పరుగులు చేసి, శ్రీలంకపై తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు చేసేందుకు దోహదపడ్డాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 574/8 పరుగులు చేసింది. అలాగే, శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 47 పరుగులిచ్చి నాలుగు వికెట్లు కూడా తీశాడు. దీంతో లంకేయులు ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
ఈ టెస్టులో లంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 175 పరుగులు చేసింది. భారత్ మాత్రం 8 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన లంక 178 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఇన్నిగ్స్ 222 రన్స్ తేడాతో భారత్ గెలిచింది. లంక రెండో ఇన్నింగ్స్‌లో డిక్వెల్లా ఒక్కడే 51 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జడేజా నాలుగు, అశ్విన్ నాలుగు, షమీ 2 వికెట్లు చొప్పున తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును రవీంద్ర జడేజాకు ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తర్వాతి కథనం
Show comments