Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మ వీరబాదుడు... ట్వంటీ20 సిరీస్ భారత్ కైవసం

పర్యాటక శ్రీలంక జట్టుతో ఇండోర్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు 88 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది.

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2017 (09:28 IST)
పర్యాటక శ్రీలంక జట్టుతో ఇండోర్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు 88 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో స్టాండింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ వీరవిహారం చేసి కేవలం 35 బంతుల్లో సెంచరీ బాదాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది.
 
ఆ తర్వాత 261 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 17.2 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా భారత జట్టు 88 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. భారత బౌలర్లలో చాహల్(4), కుల్దీప్ (3), పాండ్యా(1), జయదేవ్(1) వికెట్లతో శ్రీలంక నడ్డి విడిచారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి టీ20 డిసెంబర్ 24న ముంబైలో జరగనుంది.
 
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత క్రికెట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ 118(10 పోర్లు, 12 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా, రాహుల్ 89, ధోనీ (28) పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో ప్రదీప్(2), పెరెరా(2) చమీర (1) వికెట్లు పడగొట్టారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments