Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ధర్మశాలలో భారత్ - శ్రీలంక తొలి వన్డే

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెల్సిందే. దీంతో ఓపెనర్ రోహిత్ శర్మ టీమిండియా క

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2017 (09:49 IST)
హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెల్సిందే. దీంతో ఓపెనర్ రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కెప్టెన్‌గా అతనికిది తొలి మ్యాచ్. డేనైట్ మ్యాచే అయినా.. మంచు కారణంగా ఉదయం 11.30 ని.లకు ప్రారంభంకానుంది. 
 
మరోవైపు, ఢిల్లీ వేదికగా జరిగిన చివరి టెస్టులో శ్రీలంక ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగింది. దీంతో ఆ జట్టులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తొలి మ్యాచ్ గెలిచి వన్డే సిరీస్‌‍ను శుభారంభం చేయాలన్న పట్టుదలతో లంకేయులు ఉన్నారు. స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ల్లో లంకపై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉన్న విషయం తెల్సిందే. దీన్ని సరిచేయాలన్న తలంపులో లంక జట్టు ఉంది. 
 
ఇకపోతే, తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కెప్టెన్‌గా ఐపీఎల్‌లో మంచి అనుభవం ఉంది. అక్కడ అతనొక విజయవంతమైన సారథి. ఈ మ్యాచ్‌తో కెప్టెన్‌గా తన అంతర్జాతీయ కెరీర్‌కు మంచి శుభారంభాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. మరోవైపు ధోనీ మద్దతు కూడా ఉంటుంది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ రహానే ఫామ్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను కలవరపరుస్తోంది. ఓపెనర్లు ధావన్, రోహిత్‌ శర్మ అందించిన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచాలంటే మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెనే కీలకం. 
 
ఈ నేపథ్యంలో రహానే ఫామ్‌లోకి రావాలని జట్టు బలంగా కోరుకుంటోంది. శ్రేయస్‌ అయ్యర్, మనీశ్‌ పాండే, దినేశ్‌ కార్తీక్‌‌లతో పాటు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, అనుభవజ్ఞుడైన ధోనీలతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ, భారత కుర్రోళ్లు ఎపుడు ఎలా ఆడుతారో ఎవరికీ అంతుచిక్కని ఓ ప్రశ్న.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’

Pawan: మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్- డోలీలకు స్వస్తి.. గుడి కాదు.. బడి కావాలి.. (videos)

భర్తను రోడ్డు మీదికి ఈడ్చేలా మహిళల ప్రవర్తన ఉండరాదు : సుప్రీంకోర్టు

Snake: గురుకులం పాఠశాలలో పాము కాటు ఘటనలు.. ఖాళీ చేస్తోన్న విద్యార్థులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

రోషన్ కనకాల చిత్రం మోగ్లీ 2025 ప్రారంభం

Ram Gopal Varma : తెలంగాణ పోలీసులు స్వర్గానికి వెళ్లి శ్రీదేవిని అరెస్టు చేస్తారా?

ఆర్.ఆర్.ఆర్.కు ముందే రామ్ చరణ్ తో సినిమా నిర్ణయం తీసుకున్నా : డైరెక్టర్ శంకర్

సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా జానకి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ

తర్వాతి కథనం
Show comments