Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో విరాట్ - అనుష్క వివాహం?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల వివాహం ఇటలీలో జరుగనున్నట్టు సమాచారం. ఈ పెళ్లి కోసం అనుష్క శర్మ కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీకి వెళ్లినట్టు బీ-టౌన్ వర్గాల సమాచార

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2017 (12:20 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల వివాహం ఇటలీలో జరుగనున్నట్టు సమాచారం. ఈ పెళ్లి కోసం అనుష్క శర్మ కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీకి వెళ్లినట్టు బీ-టౌన్ వర్గాల సమాచారం. 
 
వాస్తవానికి కోహ్లీ - అనష్కలు ప్రేమలో ముగిపోయారు. వీరిద్దరిమధ్య మిగిలింది ఇక వివాహం మాత్రమే. అయితే, గత నాలుగు రోజులుగా వీరిద్దరి గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. వీరిద్దరి వివాహం ఇటలీలో జరుగబోతున్నది. ఈ ఊహాగానాల నేపథ్యంలో అనుష్క శర్మ గురువారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడింది. 
 
దీంతో ఆమె చుట్టూ చేరిన మీడియా ఇటలీ వెళుతున్నారా? అంటూ ప్రశ్నలు కురిపించింది. అనుష్క మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా థ్యాంక్యూ అని చెప్పి వెళ్లిపోయారు. అనుష్క తల్లిదండ్రులను పెళ్లి గురించి ప్రశ్నించినా వారు కూడా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. మరోపక్క ఇరు కుటుంబాల నుంచి స్నేహితులు, సన్నిహితులకు ఆహ్వాన పత్రికలు వెళుతున్నట్లు సమాచారం. 
 
ఈ ఊహాగానాలపై అనుష్క ప్రతినిధి స్పందిస్తూ ఇప్పుడిప్పుడే పెళ్లి జరగదని ప్రకటించారు. అయినా వీరిద్దరి వివాహ విషయమై చర్చలకు తెరపడటంలేదు. విరాట్‌, అనుష్క స్పందిస్తే కానీ ప్రస్తుత ఊహాగానాలపై  ఓ క్లారిటీ వచ్చేలా లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments