Webdunia - Bharat's app for daily news and videos

Install App

6,4,4,0,4,1 బౌండరీలతో చెలరేగిపోయిన శాంసంగ్.. ఇంకో ధోనీ దొరికాడా?

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (15:00 IST)
Sanju Samson
లక్నో వేదికగా సఫారీలతో జరిగిన తొలి వన్డేలో భారత్ జట్టు 9 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. 40 ఓవర్ల మ్యాచ్‌లో 250 పరుగుల టార్గెట్‌ను చేధించే క్రమంలో బరిలోకి దిగిన టీమిండియాకి ఆదిలోనే సఫారీలు కళ్లెం వేశారు. 8 పరుగులకే భారత ఓపెనర్లు పెవిలియన్ చేరారు. 
 
ఆ తర్వాత వచ్చిన గైక్వాడ్(19), ఇషాన్ కిషన్(20) కూడా తక్కువ పరుగులకే ఔట్ కావడంతో వికెట్ కీపర్ సంజూ శాంసన్(86) టీం భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. అతడికి శ్రేయాస్ అయ్యర్(50) తోడవ్వడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 
 
అయితే అర్ధ సెంచరీ చేశాక అయ్యర్ ఔట్ కావడంతో.. ఆ తర్వాత్ రెగ్యులర్ ఇంటెర్వల్స్‌లో భారత్ వికెట్లు కోల్పోవడంతో.. విజయానికి చివరి ఓవర్‌లో టీమిండియా 30 పరుగులు చేయాల్సి ఉంది. ఇక అప్పుడే శాంసన్.. తన పవర్ హిట్టింగ్ చూపించాడు. 6,4,4,0,4,1 బౌండరీలతో చెలరేగిపోయాడు. దీంతో టీమిండియాకు మరో ధోనీ దొరికాడని క్రీడా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 
 
కాని చివరికి టీమిండియా 9 పరుగుల తేడాతో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 40 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 249 పరుగులు చేసింది. డికాక్(48), క్లాసన్(74), మిల్లర్(75) రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేరుకోగలిగింది.

సంబంధిత వార్తలు

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments