Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికా పర్యటనలో భారత్ - నేటి నుంచి డర్బన్ తొలి టీ20 మ్యాచ్

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2023 (11:11 IST)
భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. డిసెంబరు పదో తేదీ నుంచి జనవరి ఏడో తేదీ వరకు ఈ క్రికెట్ టూర్ జరుగనుంది. మొత్తం మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడనుంద. ఈ మూడు ఫార్మెట్లకు మూడు వేర్వేరు జట్లను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, షమీ, బుమ్రాలు పరిమితి ఓవర్ల సిరీస్‌కు దూరంగా ఉండనున్నారు. అయితే, టెస్ట్ మ్యాచ్‌లకు మాత్రం అందుబాటులో ఉంటారు. 
 
ఇదిలావుంటే, భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా నియమించారు. అలాగే, వన్డేలకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తాడు. టెస్టుల్లో టీమిండియాను రోహిత్ శర్మ నడిపించనున్నాడు. ఈ సుదీర్ఘ పర్యటన టీ20 సిరీస్‌తో ప్రారంభం అవుతోంది. డిసెంబరు పదో తేదీ ఆదివారం డర్బన్‌లోని కింగ్స్ మీడ్ స్టేడియంలో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు తొలి టీ20లో తలపడనున్నాయి. భారత్ - సౌతాఫ్రికా జట్ల క్రికెట్ షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే, 
 
టీ20 సిరీస్ షెడ్యూల్...
తొలి టీ20- డిసెంబరు 10 (డర్బన్)
రెండో టీ20 - డిసెంబరు 12 (కెబెరా)
మూడో టీ20- డిసెంబరు 14 (జొహాన్నెస్ బర్గ్)
 
వన్డే సిరీస్ షెడ్యూల్...
తొలి వన్డే- డిసెంబరు 17 (జొహాన్నెస్ బర్గ్)
రెండో వన్డే- డిసెంబరు 19 (కెబెరా)
మూడో వన్డే- డిసెంబరు 21 (పార్ల)
 
టెస్టు సిరీస్ షెడ్యూల్...
తొలి టెస్టు- డిసెంబరు 26 నుంచి 30 వరకు (సెంచురియన్) 
రెండో టెస్టు- జనవరి 3 నుంచి 7 వరకు (కేప్ టౌన్) 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నర్సరీ పిల్లాడికి రూ. 2,51,000 ఫీజు, పాసైతే ఐఐటీ వచ్చినట్లేనట, హైదరాబాదులో అంతే...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

నర్సంపేటలో హైటెక్ వ్యభిచార రాకెట్‌‌.. నలుగురి అరెస్ట్.. ఇద్దరు మహిళలు సేఫ్

వేసవి వేడి నుండి ఉపశమనం- నెల్లూరులో ఏసీ బస్సు షెల్టర్లు

బెంగుళూరు కుర్రోడికి తిక్కకుదిర్చిన పోలీసులు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

తర్వాతి కథనం
Show comments